ICC calls emergency meeting BCCI PCB Come together to slove Champions Trophy 2025 dead lock Report
ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై ఇంకా సందిగ్థత వీడడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో పర్యటించలేమని బీసీసీఐ అంటుండగా.. మరోవైపు పాకిస్థాన్ ఎట్టి పరిస్థితుల్లో టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉన్నా ఐసీసీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నవంబర్ 26 (మంగళవారం) ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో బీసీసీఐతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సహా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రధానంగా టోర్నీ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వహించాలా? పాక్‌లో కాకుండా మరో దేశంలో టోర్నీని నిర్వహించాలా ? హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తే భారత్, పాక్ మ్యాచ్ వేదికతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ వేదికను చర్చించనుందట. ఈ సమావేశం తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ, షెడ్యూల్‌తో మిగిలిన అంశాలపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్‌కు ఒప్పుకోమని, పాక్‌లో కాకుండా వేరే దేశంలో టోర్నీని నిర్వహిస్తే తాము తప్పుకుంటామని పాక్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ మూడు వేదికలను ఎంపిక చేసింది. భారత జట్టు ఆడే మ్యాచులను లాహోర్ వేదికగా నిర్వహించాలని ప్రతిపాదించింది. ఒకవేళ హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తే.. టీమ్ఇండియా ఆడే మ్యాచులు అన్ని యూఏఈ వేదికగా జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tilak Varma : చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. టీ20ల్లో వరుసగా మూడో సెంచరీ..