ICC Champions trophy 2025 PCB gets mail from ICC
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహణపై సందిగ్థత నెలకొంది. ఇటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లు పట్టు వీడడం లేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాకిస్థాన్‌లో పర్యటించబోమని ఇప్పటికే బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పింది. అదే సమయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్‌కి రావాలని పీసీబీ పట్టు బడుతోంది. ఈక్రమంలో సోమవారం జరగాల్సిన ఛాంపియన్ ట్రోఫీ 100 రోజుల కౌంట్‌డౌన్ ఈవెంట్‌ను సైతం ఐసీసీ రద్దు చేసింది.
Gautam Gambhir : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ పై గంభీర్ కామెంట్స్.. పాంటింగ్‌కు చురకలు..
పాక్‌లో భారత్ అడుగుపెట్టదు అనే విషయాన్ని ఐసీసీ పీసీబీకి మెయిల్ చేసింది. ఈ మెయిల్‌ను పీసీబీ తమ ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు ఏం చేయాలని అనే దానిపై సలహాను కోరింది. “తమ జట్టును పాక్‌కు పంపమని బీసీసీఐ తెలిపినట్లు ఐసీసీ నుంచి మెయిల్ వచ్చింది. బీసీసీఐ నుంచి మాత్రం మెయిల్ రాలేదు. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేశాం. సలహా కోరాం.” అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీ అయిష్టత చూపుతోంది. భారత జట్టును తమ దేశానికి రప్పించాలని పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ భారత జట్టు తమ దేశానికి రాకుండాఏ వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు తమ జట్టును పంపించకూడదని పాక్ బోర్డు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
SA vs IND : మ్యాచ్ ఓడిపోయినా.. అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి.. 33 ఏళ్ల వయసులో..
ఇదిలా ఉంటే.. భారత్, పాకిస్థాన్ జట్లు మొండికేసే మాత్రం ఈ టోర్నీని రద్దు చేయడమో, వాయిదా వేసే అవకాశం ఉందని ఐసీసీ అధికారులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.