ICC mens test rankings Harry Brook No1 ranked Test batter
భారత్‌తో ఇటీవల ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులతో రాణించిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో చాన్నాళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు రెండో స్థానానికి పడిపోయాడు. వీరిద్దరి మధ్య 18 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది.
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం(269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) సాధించిన టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ ఏకంగా 15 స్థానాలు మెరుగుపరచుకుని తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడు, యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో, స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నారు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. లార్డ్స్‌లో భారత జట్టు గణాంకాలు ఇవే..
బ్యాటర్ల టాప్-5 టెస్టు ర్యాంకింగ్స్ ఇవే..
* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 886 రేటింగ్ పాయింట్లు
* జోరూట్ (ఇంగ్లాండ్) – 868 రేటింగ్ పాయింట్లు
* కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 867 రేటింగ్ పాయింట్లు
* యశస్వి జైస్వాల్ (భారత్) – 858 రేటింగ్ పాయింట్లు
* స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 813 రేటింగ్ పాయింట్లు
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నో ఛేంజ్..
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నప్పటికి టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలోనే ఉన్నాడు. రెండో స్థానంలో రబాడ, మూడో స్థానంలో పాట్ కమిన్స్, నాలుగులో జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు.
బౌలర్ల టాప్-5 టెస్టు ర్యాంకింగ్స్ ఇవే..
జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 898 రేటింగ్ పాయింట్లు
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 851 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 840 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 817 రేటింగ్ పాయింట్లు
నోమన్ అలీ (పాకిస్థాన్) – 806 రేటింగ్ పాయింట్లు