ENG vs IND : లార్డ్స్‌లో మూడో టెస్టు.. ఇంగ్లాండ్ గడ్డ పై 23 ఏళ్లుగా పదిలంగా ఉన్న ద్రవిడ్ రికార్డు పై గిల్ కన్ను..
ఇంగ్లాండ్‌తో జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.

ENG vs IND 3rd Test Shubman Gill eye on Rahul Dravid 23 year old record in England
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలను చేపట్టిన శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులతో చెలరేగాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులే చేశాడు.
కానీ రెండో టెస్టు మ్యాచ్‌లో అయితే తన కెరీర్‌లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) బాదాడు. అంతేనా రెండో ఇన్నింగ్స్‌లోనూ (161) భారీ శతకం చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఏకంగా 585 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లాండ్‌తో జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.
ENG vs IND : లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. రిషబ్ పంత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
ఇంగ్లాండ్ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్‌కు వచ్చింది. ప్రస్తుతం ఈ రికార్డు టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ 2002 సంవత్సరంలో ఇంగ్లాండ్ గడ్డ పై ఇంగ్లాండ్‌తో జరిగిన 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో 620 పరుగులు సాధించాడు. గిల్ లార్డ్స్ టెస్టులో 18 పరుగులు చేస్తే ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
ఇంగ్లాండ్ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
రాహుల్ ద్రవిడ్ – 602 పరుగులు (2002లో)
విరాట్ కోహ్లీ – 593 పరుగులు (2018లో)
శుభ్‌మన్ గిల్ – 585 పరుగులు (2025లో)
సునీల్ గవాస్కర్ – 542 పరుగులు (1979లో)
రాహుల్ ద్రవిడ్ – 461 పరుగులు (2011లో)
జైస్వాల్ రికార్డును బ్రేక్ చేస్తాడా?
శుభ్‌మన్ గిల్ జైస్వాల్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీసుల్లో ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే ఛాన్స్ గిల్ ముంగిట ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు జైస్వాల్ పేరిట ఉంది. 2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జైస్వాల్ 712 పరుగులు సాధించాడు. గిల్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో 127 పరుగులు చేస్తే జైస్వాల్‌ను అధిగమిస్తాడు.
Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డే క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీసుల్లో ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు..
యశస్వి జైస్వాల్ – 712 పరుగులు (2024లో)
విరాట్ కోహ్లీ – 655 పరుగులు (2016లో)
రాహుల్ ద్రవిడ్ – 602 పరుగులు (2002లో)
విరాట్ కోహ్లీ – 593 పరుగులు (2018లో)
విజయ్ మంజ్రేకర్ – 586 పరుగులు (1961లో)
శుభ్‌మన్ గిల్ – 585 పరుగులు (2025లో)