ENG vs IND : లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. రిషబ్ పంత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో పంత్ గనుక 5 సిక్సర్లు కొడితే.. టీమ్ఇండియా తరుపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు.
ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 103 టెస్టు మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు బాదాడు. ఇక పంత్ విషయానికి వస్తే 45 మ్యాచ్‌ల్లో 86 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం భారత్ తరుపున సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డే క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
ఇక రెండో స్థానంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు కొట్టాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
రోహిత్ శర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు
రిషబ్ పంత్ – 45 మ్యాచ్‌ల్లో 86 సిక్సర్లు
ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు
రవీంద్ర జడేజా – 82 మ్యాచ్‌ల్లో 72 సిక్సర్లు
ENG vs IND : లార్డ్స్‌లో 45 నిమిషాల పాటు జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్‌కు చుక్కలే..
ఇంగ్లాండ్ గడ్డపై పంత్ వీర విహారం చేస్తున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (134, 118) శతకాలు బాదాడు. ఈ మ్యాచ్‌లో అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండో టెస్టులో అతడు 25, 65 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు రెండు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం పంత్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే లార్డ్స్ టెస్టులోనే సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సెహ్వాగ్ రికార్డును ఈ మ్యాచ్‌లో అందుకోకపోయినా రోహిత్ శర్మను దాటేసే అవకాశం ఉంది.