ENG vs IND : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు.. లార్డ్స్‌లో భారత జట్టు గణాంకాలు ఇవే..
మూడో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న లార్డ్స్ మైదానంలో భారత రికార్డు ఏమంత గొప్పగా లేదు.

Do you know team india test record in lords
ఇంగ్లాండ్ గడ్డ పై తొలి టెస్టులో ఓడిపోయిన భారత్ ఆ తరువాత అద్భుతంగా పుంజుకుని రెండో టెస్టులో విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక లార్డ్స్ వేదికగా జూలై 10 నుంచి 14 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని అటు ఇంగ్లాండ్, ఇటు భారత జట్లు భావిస్తున్నాయి.
ఇప్పటికే లార్డ్స్‌కు చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్ కోసం మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యర్థి పై విజయం సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సాధారణంగా లార్డ్స్ మైదానం పేసర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్‌లు ఆడింది. ఎన్ని విజయాలను సాధించిందో ఓ సారి చూద్దాం.
లార్డ్స్ స్టేడియంలో భారత జట్టు రికార్డు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఇక ఈ స్టేడియంలో భారత్ పై ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు 653 పరుగులుగా ఉంది. అదే టీమ్ఇండియా అత్యధిక స్కోరు 454గా ఉంది.
పిచ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు తమ తుది జట్లలో పలు మార్పులతో బరిలోకి దిగనున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ భాగంగా రెండో టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి నివ్వగా అతడు మూడో టెస్టులో ఆడనున్నట్లు ఇప్పటికే కెప్టెన్ గిల్ చెప్పాడు. అటు ఇంగ్లాండ్ గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్‌లను జట్టులోకి తీసుకోవచ్చు.