T20 World Cup: అఫ్ఘాన్‌పై కివీస్ విజయం.. సెమీస్ నుంచి భారత్ ఔట్!
స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించారు.

T20 Afghan
T20 World Cup: స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) జట్టుకు శుభారంభం అందించగా.. నాలుగో ఓవర్లో మిచెల్ అవుటయ్యాడు. తర్వాత కేన్ విలియమ్సన్ (10 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ మార్టిన్ గప్తిల్‌ను బౌల్డ్ చేశాడు.
రెండు వికెట్లు పడిన తర్వాత మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. అఫ్ఘాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేసి జట్టుకు విజయం అందించారు. 18.1ఓవర్లలోనే 125పరుగులు చేసి మ్యాచ్ ముగించారు. ఈ మ్యాచ్ టీమిండియా సెమీస్ ఆశలు నిలబెట్టే మ్యాచ్ కాగా.. అఫ్ఘానిస్తాన్ పెద్దగా ప్రభావం చూపట్లేదు.
భారత జట్టు అభిమానులు కివీస్ ఓటమి కోసం ఆశగా ఎదురుచూసినా.. భారత్ ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో భారత జట్టు సెమీస్ నుంచి ఔట్ అయిపోయింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ మొదట బ్యాటింగ్ ఎంచుకుని న్యూజిలాండ్‌ని బౌలింగ్‌కి ఆహ్వానించింది. నజీబ్ జద్రాన్ హాఫ్ సెంచరీ(73) చేయడంతో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.
ఓపెనర్లు షెహజాద్(4), జజాయ్ (2), రహ్మనుల్లా (6) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాసేపు నిలబడిన గుల్బాదిన్ నైబ్ (15) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఓపెనర్లు, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అవుట్ అవడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఇదే సమయంలో క్రీజ్‌లో ఉన్న నజిబుల్లా జద్రాన్ (73)తో ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
అతనికి కాసేపు సహకారం అందించిన కెప్టెన్ మొహమ్మద్ నబీ 20 బంతుల్లో 14 పరుగులు చేశాడు. సౌథీ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే కరీమ్ జనత్ (2) అవుటయ్యాడు.
అఫ్ఘాన్ ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ (3) కూడా కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. నజిబుల్లా జద్రాన్ ఒక్కటే మంచి పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది.