U-19 Womens T20 World Cup : నేటి నుంచి మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌

క్రికెట్ ప్ర‌పంచంలో మ‌రో టోర్నీకి రంగం సిద్ధ‌మైంది.

ICC U-19 Womens T20 World Cup 2025

క్రికెట్ ప్ర‌పంచంలో మ‌రో టోర్నీకి రంగం సిద్ధ‌మైంది. మ‌హిళ‌ల అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్‌కు తెర‌లేవ‌నుంది. మ‌లేసియా వేదిక‌గా ఈ మెగా టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతున్న భార‌త జ‌ట్టు మ‌రోసారి విజేత‌గా నిల‌వాల‌ని ఆరాట‌ప‌డుతోంది.

మొత్తం 16 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూపు-ఏలో భార‌త్‌తో పాటు ఆతిథ్య మ‌లేషియా, శ్రీలంక, వెస్టిండీస్‌లు ఉన్నాయి. ప్ర‌తి గ్రూపులో టాప్‌-3లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ సిక్స్‌కి అర్హ‌త సాధిస్తాయి. అక్క‌డ 12 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్ర‌తి గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్స్ ఆడ‌తాయి. సెమీ ఫైన‌ల్స్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆడ‌నున్నాయి.

Megastar Chiranjeevi : షార్జా స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి సందడి.. వీడియో

ప్ర‌పంచ క‌ప్ తొలి రోజు ఆరు మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. స్కాటాండ్‌తో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌తో ఇంగ్లాండ్‌, సమోవాతో నైజీరియా, నేపాల్‌తో బంగ్లాదేశ్‌, అమెరికాతో పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఇక భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను ఆదివారం నాడు వెస్టిండీస్‌తో ఆడ‌నుంది. ఈ టోర్నీలో రాణించి సీనియ‌ర్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాల‌ని ప్లేయ‌ర్లు ఆరాట‌ప‌డుతున్నారు. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్లేయ‌ర్లు గొంగ‌డి త్రిష‌, ష‌బ్న‌మ్ ష‌కీల్‌, ద్రితి కేస‌రి లపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. వీరిలో గొంగిడి త్రిష గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ ఆడింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో టాప్‌స్కోర‌ర్‌గా నిలిచింది.

Dinesh Karthik stunning catch : సౌతాఫ్రికా గ‌డ్డ పై దినేశ్ కార్తీక్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. సూప‌ర్ మేన్ అంటున్న నెటిజ‌న్లు.. వీడియో

మహిళల అండర్‌–19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..
నికీ ప్రసాద్‌ (కెప్టెన్‌), సానిక చల్కె, గొంగడి త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి.