Dinesh Karthik stunning catch : సౌతాఫ్రికా గడ్డ పై దినేశ్ కార్తీక్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్ మేన్ అంటున్న నెటిజన్లు.. వీడియో
ముంబై కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు దినేశ్ కార్తీక్.

Dinesh Karthik takes stunning catch in SA20
టీమ్ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కోర్ టీమ్ అయిన పార్ల్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ముంబై కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బోలాండ్ పార్క్‌లో బుధవారం ముంబై కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. ముంబై బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్ (91; 64 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రీజా హెండ్రిక్స్ (30; 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (13) విఫలం అయ్యాడు.
ముంబై ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దయాన్ గాలీమ్ ఈ ఓవర్‌ను వేశాడు. తొలి బంతిని అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆన్ సైడ్ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే.. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనుక వైపుగా వెళ్లింది. వికెట్ కీపింగ్ చేస్తున్న దినేశ్ కార్తీక్ అమాంతం తన కుడి చేతి వైపు డైవ్ చేస్తూ బంతిని అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాయల్స్ బ్యాటర్లలో లువాన్-డ్రే ప్రిటోరియస్ (83; 52 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జోరూట్ (15) విఫలం అయినా డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 24 నాటౌట్) రాణించాడు. ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ దురదృష్ట వశాత్తు రనౌట్ అయ్యాడు. కార్తీక్ 6 బంతుల్లో ఓ సిక్స్ బాది 10 పరుగులు చేశాడు.
Is it a 🦅? Is it a ✈️? It’s DK 🤯
Dinesh Karthik’s stunning catch gives #PaarlRoyals their 1st wicket!
Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18 2!#PRvMICT pic.twitter.com/3QilKUKi7r
— JioCinema (@JioCinema) January 15, 2025