ODI World Cup-2023: పాకిస్థాన్ ప్లేయర్ కావాలనే అలా చేశాడా? వెనక్కు జరిగిన బౌండరీ లైన్.. ఫొటో వైరల్ ..

పాకిస్థాన్ ప్లేయర్ కావాలనే అలా చేశాడా? అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. పాక్ ప్లేయర్ బౌండరీ లైన్ వద్ద వెనక్కు జరిగే సమయంలో బౌండరీ లైన్ రోప్ వెనక్కు జరిగి ఉండిఉండోచ్చని

ODI World Cup-2023: పాకిస్థాన్ ప్లేయర్ కావాలనే అలా చేశాడా? వెనక్కు జరిగిన బౌండరీ లైన్.. ఫొటో వైరల్ ..

Pakistan vs Netherlands match

Updated On : October 7, 2023 / 8:30 AM IST

World Cup 2023 PAK vs NED: ప్రపంచ కప్-2023లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ రాణించలేకపోయింది. ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ రోప్ 30 నిమిషాల అంతకంటే ఎక్కువ సమయం వెనక్కు నెట్టబడ్డాయి. పాకిస్థాన్ ఫీల్డర్ ఈ చర్యలకు పాల్పడినట్లు ఫొటో వైరల్ అవుతుంది.

Pakistan Player Fielding Near Boundary Line | Source: X/Twitte

Pakistan Player Fielding Near Boundary Line | Source: X/Twitte

MCC (Marylebone Cricket Club) నిర్దేశించిన చట్టాలకు ఈ చర్య విరుద్ధం, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ఇదే ఫాలో అవుతుంది. బౌండరీ లైన్ వెనక్కు జరిగిన సమయంలోనే బ్యాటర్ సిక్స్ బాదితే.. ఆ బాల్ గాల్లోకి ఎగిరి బౌండరీలైన్ రోప్ వెనక్కు జరిగిన ప్రదేశంలో పడితే పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ తరువాత నెదర్లాండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో 21 ఓవర్లలోని ఐదో బంతికి పాకిస్థాన్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

 

 

పాకిస్థాన్ ప్లేయర్ కావాలనే అలా చేశాడా? అంటే అది ఖచ్చితంగా చెప్పలేము. పాక్ ప్లేయర్ బౌండరీ లైన్ వద్ద వెనక్కు జరిగే సమయంలో బౌండరీ లైన్ రోప్ వెనక్కు జరిగి ఉండిఉండోచ్చని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. బౌండరీలైన్ రోప్ వెనక్కు జరిగిన సమయంలో బాల్ బాయ్ లేదా ఇతరులు దానిని సరిచేయాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. మ్యాచ్ అధికారులు, వ్యాఖ్యాతలు చట్ట ఉల్లంఘనను గుర్తించకలేక పోవటం కూడా ఆసక్తికరంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.