Ravi Shastri : భార‌త ప్ర‌పంచ‌క‌ప్ అవ‌కాశాల‌పై ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. మ‌రో 12 సంవ‌త్స‌రాలు ఆగాల్సిందే..!

భార‌త ప్ర‌పంచ‌క‌ప్ అవ‌కాశాల‌పై భార‌త మాజీ హెడ్ కోచ్‌, కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు.

Ravi Shastri comments

Ravi Shastri comments : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వ‌రుస విజ‌యాల‌తో అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టికే సెమీస్‌కు చేరింది. ఈ నెల 15 బుధ‌వారం న్యూజిలాండ్‌తో సెమీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో భార‌త ప్ర‌పంచ‌క‌ప్ అవ‌కాశాల‌పై భార‌త మాజీ హెడ్ కోచ్‌, కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి గ‌నుక భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌కుంటే మ‌రో 12 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఆగాల్సి ఉంటుంద‌న్నాడు.

12 సంవ‌త్స‌రాల క్రితం భార‌త్ విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఇప్పుడు మ‌రోసారి క‌ప్‌ను ముద్దాడే అవ‌కాశం వ‌చ్చింది. ఈ మెగాటోర్నీలో భార‌త్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఇంత‌కంటే మంచి ఛాన్స్ మ‌రోసారి రాదనిపిస్తోంది. ఒక‌వేళ ఈ సారి టీమ్ఇండియా విశ్వ‌విజేత‌గా నిల‌వ‌కుంటే క‌ల నెర‌వేర్చుకునేందుకు మ‌రో మూడు ప్ర‌పంచ‌క‌ప్‌లు దాకా నిరీక్షించాల్సి రావొచ్చు అని ర‌విశాస్త్రి అన్నారు.

Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. స‌చిన్ రికార్డు స‌మం

ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్ల‌ల‌లో ఏడు నుంచి ఎనిమిది మంది ఆట‌గాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నార‌ని చెప్పాడు. కొంద‌రు ఆట‌గాళ్ల‌కు ఇదే చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్ కావొచ్చు. పిచ్ ప‌రిస్థితులు, ప్లేయ‌ర్లు ఆడుతున్న విధానం, టీమ్ఇండియా సాధిస్తున్న విజ‌యాల‌ను చూస్తుంటే ఈ సారి క‌ప్‌ను ముద్దాడ‌డం పెద్ద క‌ష్టం కాద‌నిపిస్తోంద‌ని అన్నాడు. టీమ్ఇండియా పేస్ విభాగం దుర్బేధ్యంగా ఉందన్నాడు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా బుమ్రా, ష‌మీలు క‌లిసి ఆడుతూ నిల‌క‌డ‌గా వికెట్లు తీస్తున్నారు. వీరికి సిరాజ్ జ‌త క‌లిశాడు. స్పిన్న‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్ లు కూడా మ‌ధ్య ఓవ‌ర్ల‌ల‌లో క‌ట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. వీరికి పిచ్‌ల‌పై ఎక్క‌డ బౌలింగ్ చేస్తే వికెట్లు వ‌స్తాయ‌నే విష‌యం పై సంపూర్ణ అవ‌గాహ‌న ఉందన్నారు. 50 ఏళ్ల చ‌రిత్ర గ‌ల ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో తాను చూసిన అత్యుత్త‌మ పేస్ బౌలింగ్ ఎటాక్ ఇదేన‌ని ర‌విశాస్త్రి తెలిపారు.

Greatest catch ever : మీ జీవితంలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు.. చేతుల‌తో కాదు.. వీపుతో..

ట్రెండింగ్ వార్తలు