Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. స‌చిన్ రికార్డు స‌మం

Virat Kohli-Sachin Tendulkar : ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సార్లు అర్ధ‌శ‌త‌కాలు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌.. స‌చిన్ రికార్డు స‌మం

Virat Kohli

ప‌రుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సార్లు అర్ధ‌శ‌త‌కాలు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌, బంగ్లాదేశ్ బ్యాట‌ర్ ష‌కీబ్‌ల రికార్డును స‌మం చేశాడు. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 53 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేయ‌డం ద్వారా విరాట్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో విరాట్ 7 సార్లు అర్ధ‌శ‌త‌కాలు బాదాడు.

ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆట‌గాళ్లు..

సచిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 7 సార్లు – 2003
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌)- 7 సార్లు – 2019
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 7*సార్లు – 2023

Rohit Sharma : ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ ప‌లు రికార్డులు బ్రేక్‌

ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్ క‌లిపి ఈ మెగా టోర్నీలో 9 మ్యాచులు ఆడి 99 స‌గ‌టుతో 594 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగానూ నిలిచాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో క్వింట‌న్ డికాక్ ఉన్నాడు. డికాక్ 9 మ్యాచుల్లో 65.66 స‌గ‌టుతో 591 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత జాబితాలో న్యూజిలాండ్ ఆట‌గాడు ర‌చిన్ ర‌వీంద్ర ఉన్నాడు. ర‌చిన్ 9 మ్యాచుల్లో 70.62 స‌గ‌టుతో 565 ప‌రుగులు చేశాడు.

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టాప్‌-5 ఆట‌గాళ్ల జాబితా..

విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 594 ప‌రుగులు
క్వింట‌న్ డికాక్ (ద‌క్షిణాఫ్రికా) – 591
ర‌చిన్ ర‌వీంద్ర (న్యూజిలాండ్) – 565
రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 503
డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – 499 ప‌రుగులు చేశారు.

Greatest catch ever : మీ జీవితంలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండ‌రు.. చేతుల‌తో కాదు.. వీపుతో..