Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశ ముగింపుకు వచ్చేసింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే.. ఈ నాలుగు జట్లు కూడా లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో నిలిచేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఆదివారం గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం ఆర్‌సీబీకి బాగా కలిసి వచ్చింది. దీంతో టాప్-2లో నిలిచేందుకు ఆర్‌సీబీకి మార్గం సుగమమైంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆర్‌సీబీ 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 17 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.255గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
లీగ్ దశలో ఆర్‌సీబీ మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే మిగిలిన జట్లతో సంబందం లేకుండా టాప్-2 ప్లేస్‌లో నిలుస్తుంది. ఓడిపోతే మూడు లేదా నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు వెలుతుంది. అంటే ఈ లెక్కన ఆర్‌సీబీ టాప్-2 భవితవ్యం ఆ జట్టు చేతిలోనే ఉంది. అయితే.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన లక్నోను తేలికగా అంచనా వేయడానికి వీలులేదు.
సోమవారం ముంబై, పంజాబ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా టాప్ ప్లేస్‌లోకి వెలుతుంది.