IND vs AUS 2nd ODI Rohit sharma needs 2 runs to create history
Rohit sharma : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రాణించలేదు. 14 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ ఓ ఫోర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అదనపు బౌన్స్ కారణంగా తడబడిన రోహిత్ సిప్స్‌లో క్యాచ్ ఇచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2027 ఆశలు సజీవంగా ఉండాలంటే ఆసీస్‌తో సిరీస్‌లో రాణించడం రోహిత్ శర్మ(Rohit sharma)కు ఎంతో ముఖ్యం. తొలి వన్డేలో విఫలమైన హిట్‌మ్యాన్ మిగిలిన రెండు వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా జరగనుంది.
IND vs AUS : అతడిని ఎందుకు దాస్తున్నారు.. ఎక్స్‌పోజ్ చేయండి.. బుమ్రా లేనప్పుడైనా..
ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అతడు రెండు పరుగులు సాధిస్తే.. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు హిట్‌మ్యాన్ 20 మ్యాచ్‌ల్లో 998 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి.
ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – 998 పరుగులు
* విరాట్ కోహ్లీ – 802 పరుగులు
* సచిన్ టెండూల్కర్ – 740 పరుగులు
* ఎంఎస్ ధోని – 684 పరుగులు
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు..
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 274 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 266 ఇన్నింగ్స్‌ల్లో 344 సిక్సర్లు కొట్టాడు. ఆసీస్‌తో సిరీస్‌లో మరో 8 సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు.