IND vs AUS: మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్.. బుమ్రాకు 6 వికెట్లు

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది.

IND vs AUS: మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్.. బుమ్రాకు 6 వికెట్లు

India vs Australia 3rd Test

Updated On : December 16, 2024 / 7:23 AM IST

India vs Australia 3rd Test: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు (ఆదివారం) ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్లు కోల్పోయి ఆసీస్ 405 పరుగులు చేయగా.. మూడోరోజు (సోమవారం) ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మిగిలిన బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. దీంతో 445 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు జస్ర్పీత్ బుమ్రా ఆరు వికెట్లు తీసుకోగా.. సిరాజ్ రెండు, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు.

 

మూడోరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆదివారం మ్యాచ్ ముగిసిన తరువాత బ్రిస్బేన్ లో వర్షం పడింది. ఈ క్రమంలో సోమవారం ఉదయానికి మైదానం చిత్తడిగా మారడంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. ఉదయం మ్యాచ్ ప్రారంభమైన వెంటనే మిచెల్ స్టార్క్ (18), అలెక్స్ కేరీ దూకుడుగా ఆడారు. అయితే, బుమ్రా అద్భుత బంతితో స్టార్క్ ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత వర్షం కారణంగా ఆటకు కాస్త అంతరాయం ఏర్పడింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా.. నాథన్ లైయన్ (2) ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. చివర్లో అలెక్స్ కారీ(70)ని ఆకాశ్ దీప్ పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా బ్యాటర్లు హిట్.. మనోళ్లు ఏం చేస్తారో..! గబ్బాలో ముగిసిన రెండోరోజు ఆట

భారీ పరుగుల ఛేదన లక్ష్యంతో భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. అయితే, ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యశస్వీ జైస్వాల్ (4) ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో తొలి బాల్ బౌండరీకి తరలించిన జైస్వాల్.. రెండో బంతికి షార్ట్ మిడ్ వికెట్ లో మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి శుభ్ మన్ గిల్ వచ్చాడు.