Nitish Kumar Reddy Test century : టెస్టుల్లో నితీష్‌కుమార్ రెడ్డి తొలి సెంచ‌రీ.. అరుదైన జాబితాలో చోటు.. సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్‌

టీమ్ఇండియా న‌యా ఆల్‌రౌండ‌ర్ నితీష్‌కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు

IND vs AUS 4th Test Nitish Kumar Reddy maiden Test century

టీమ్ఇండియా న‌యా ఆల్‌రౌండ‌ర్ నితీష్‌కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. తొలి అర్థ‌శ‌త‌కాన్నే సెంచ‌రీగా మలిచాడు. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు.

స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి తీసి 171 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో మూడు అంకెల స్కోరును చేరుకున్నాడు. సెంచ‌రీ చేసిన అనంత‌రం త‌న‌దైన శైలిలో సంబ‌రాలు చేసుకున్నాడు. ప్ర‌స్తుతం నితీష్ సెంచ‌రీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

©ANI

Nitish Kumar Reddy : అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టైల్‌లో తెలుగుకుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెల‌బ్రేష‌న్స్‌.. అదుర్స్‌

ఈ సెంచ‌రీతో అతి చిన్న‌ వ‌య‌సులో ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సెంచ‌రీ చేసిన మూడో భార‌త ఆట‌గాడిగా నితీష్ రెడ్డి రికార్డుల‌కు ఎక్కాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్‌, రిష‌బ్ పంత్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

అతి త‌క్కువ వ‌య‌సులో ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సెంచ‌రీ చేసిన భార‌త ఆట‌గాళ్లు..

స‌చిన్ టెండూల్క‌ర్ – 18 ఏళ్ల 256 రోజులు (1992లో సిడ్నీలో)
రిష‌బ్ పంత్ – 21 ఏళ్ల 92 రోజులు (2019లో సిడ్నీలో)
నితీశ్‌కుమార్ రెడ్డి – 21 ఏళ్ల 216 రోజులు (2024లో మెల్‌బోర్న్‌లో)
దత్తు ఫడ్కర్ – 22 ఏళ్ల 46 రోజులు (1948లో అడిలైడ్‌లో)

©ANI

©ANI