Nitish Kumar Reddy : అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టైల్‌లో తెలుగుకుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సెలబ్రేషన్స్.. అదుర్స్
పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి భారీ స్కోర్లుగా మలచలేకపోయిన నితీష్.. ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు.

IND vs AUS 4th test Nitish Kumar Reddy Pushpa style celebration on Reaching maiden Test fifty
ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు కుర్రాడు, టీమ్ఇండియా పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. పలు మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయిన నితీష్ ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీష్ అర్థశతకంతో రాణించాడు. టెస్టుల్లో అతడికి ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.
గత మూడు టెస్టు మ్యాచుల్లో నితీష్ వరుసగా 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులు చేశాడు. పలు మార్లు అర్థశతకాలను చేసే అవకాశాలను చేజార్చుకున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో 8 స్థానంలో బరిలోకి దిగిన నితీష్ తనదైన శైలిలో పరుగులు చేస్తూ 81 బంతుల్లో హాఫ్ సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు.
Rohit Sharma: అశ్విన్ బాటలో రోహిత్..! మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్.. కీలక ప్రకటన చేసే అవకాశం
మిచెల్ స్టార్క్ వేసిన బంతిని బౌండరీకి తరలించి అర్థశతకాన్ని పూర్తి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీలోని పుష్ప ట్రేడ్ మార్క్ స్టైల్‌లో సంబురాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 164/5 తో ఆటను ప్రారంభించిన భారత్‌కు గట్టి షాకులే తగిలాయి. దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (28), ఆచితూచి ఆడిన రవీంద్ర జడేజా (17)లు తొందరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తో కలిసి జట్టును మొదట ఫాలో ఆన్‌గండం నుంచి బయట పడేశాడు. భారత్ స్కోరు 275 పరుగుల మార్క్‌ను తాకగానే ఫాలో ఆన్ గండం తప్పింది.
Cricket Viral Videos : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..
ఆ తరువాత వీరిద్దరు ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తమదైన శైలిలో పరుగులు రాబడున్నారు. ప్రస్తుతం ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం రావడంతో మూడో రోజు టీ విరామాన్ని కాస్త ముందుగానే తీసుకున్నారు. 97 ఓవర్లకు భారత స్కోరు 326/7. నితీష్‌కుమార్ రెడ్డి (85), వాషింగ్టన్ సుందర్ (40) లు క్రీజులో ఉన్నారు. వీరిద్దరు అభేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ ఇంకా 148 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
“𝙈𝙖𝙞𝙣 𝙟𝙝𝙪𝙠𝙚𝙜𝙖 𝙣𝙖𝙝𝙞!” 🔥
The shot, the celebration – everything was perfect as #NitishKumarReddy completed his maiden Test fifty! 👏#AUSvINDOnStar 👉 4th Test, Day 3 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/hupun4pq2N
— Star Sports (@StarSportsIndia) December 28, 2024