IND vs AUS _ Ruturaj Gaikwad becomes 3rd India batter to get out for a diamond duck in T20Is
IND vs AUS T20I : భారత జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో మాథ్యూ వేడ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీ20 క్రికెట్‌లో డైమండ్ డక్ అయిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా డైమండ్ డకౌట్ అయిన భారతీయ బ్యాటర్ల జాబితాలో అమిత్ మిశ్రా, జస్ప్రీత్ బుమ్రా తర్వాత రుతురాజ్ కూడా చేరాడు.
బుమ్రా, అమిత్ మిశ్రా తర్వాత గైక్వాడ్ :
ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. 0.5 ఓవర్లలో 11 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. మార్కస్ స్టోయినీస్ తొలి ఓవర్ వేయగా.. గైక్వాడ్ ఒక పరుగు కూడా తీయకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్ 5వ బంతికి జైస్వాల్ ఫైన్ లెగ్ దిశగా క్విక్ డబుల్ తీసేందుకు ప్రయత్నించాడు.
అక్కడితో ఆగకుండా రెండో పరుగుకు గైక్వాడ్‌ను రమ్మని పిలిచాడు. ఈ క్రమంలో హాఫ్ పిచ్ దాటిన గైక్వాడ్ వెంటనే వెనక్కి వచ్చే ప్రయత్నంలో డైమండ్ డక్ ఔటయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యో పాపం గైక్వాడ్ అని కామెంట్లు పెడుతున్నారు.
Very bad call by jaiswal , Ruturaj Gaikwad Trusted on his call runs and he stops him at half track #INDvsAUS #INDvAUS #IndianCricket #IPLAuction #ipl2024 #RuturajGaikwad pic.twitter.com/KPsZ1Zudjt
— Ankit bhumla(Gurjar) (@Kuldeep13726336) November 23, 2023
Read Also : Rahul Dravid : ఇంకో ఏడాదా..? అస్సలు వద్దు.. టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ ఎవరో తెలుసా..?
గైక్వాడ్ మాదిరిగానే గతంలో అమిత్ మిశ్రా జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20ఐలలో డైమండ్ డక్‌కి ఔటయ్యారు. ఫిబ్రవరి 9, 2016న, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా డైమండ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత జనవరి 2017లో నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్ మిశ్రా అవుటయ్యాడు.
#RuturajGaikwad #yashasvijaiswal #INDvsAUS pic.twitter.com/pEkXlLczbx
— __MSD7781__ (@SurajHS3) November 23, 2023
మొత్తం 21మంది భారతీయ బ్యాటర్లు డకౌట్ :
ఓవరాల్‌గా, భారత క్రికెట్‌లో 21 మంది భారతీయ బ్యాటర్లు డైమండ్ డక్ ఔట్ అయ్యారు. అందులో బుమ్రా, మిశ్రా, గైక్వాడ్‌లతో పాటు బిషన్ సింగ్ బేడీ, రోజర్ బిన్నీ, అన్షుమన్ గైక్వాడ్, చేతన్ శర్మ, వెంకట్పతి రాజు, జవగల్ శ్రీనాథ్, అబే కురువిల్లా, రాజేష్ చౌహాన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఎంఎస్‌కే ప్రసాద్, హర్భజన్ సింగ్, రాహుల్ ద్రవిడ్, శ్రీశాంత్, జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ ఉన్నారు. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ)లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత్ రెండవ టీ20లో ఆడాలని గైక్వాడ్ భావిస్తున్నాడు.
కాగా, తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. దాంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యం సాధించింది.
Read Also : IND vs AUS 1st T20 : దంచికొట్టిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్.. తొలి టీ20లో ఆస్ట్రేలియా పై భారత్ విజయం