IND vs ENG: అరెరే.. టీమిండియా కొంపముంచిన రవీంద్ర జడేజా.. సింపుల్ క్యాచ్ మిస్.. వీడియో వైరల్
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జడేజా వదిలేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ravindra Jadeja
IND vs ENG: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండోరోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాను 471 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఆ తరువాత బ్యాటింగ్ లోనూ సత్తాచాటింది.
ఆ జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే క్రాలీ(4) ఔట్ అయినప్పటికీ.. డకెట్ (62), ఒలీ పోప్ (100బ్యాటింగ్) రాణించారు. దీంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే, తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు కంటే ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు క్యాచ్‌లు మిస్ చేయడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రవీంద్ర జడేజా సింపుల్ క్యాచ్ ను మిస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Ben Duckett sweeps and gets to his 14th Test fifty. pic.twitter.com/B8oIuZu0Cq
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2025
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జడేజా వదిలేసాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ చివరి బంతిని ఇంగ్లాండ్ ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ బెన్ డకెట్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి డకెట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా తక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా డ్రైవ్ చేసినప్పటికీ క్యాచ్‌ను అందుకోలేక పోయాడు. ఆ సమయంలో బెన్ డకెట్ వ్యక్తిగత స్కోర్ 15 పరుగులు మాత్రమే. ఆ తరువాత డకెట్ 62 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
#RavindraJadeja #INDvsENGTest pic.twitter.com/3aMFqrTper
— ABHISHEK PANDEY (@anupandey29) June 21, 2025