IND vs ENG 2nd Odi Rohit Sharma breaks Sachin Tally In Elite Openers Club
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 58 అర్థశతకం. ఈ క్రమంలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
346 మ్యాచ్‌లో సచిన్ ఓపెనర్‌గా వచ్చి 48.07 సగటుతో 15335 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మాత్రం 343 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 15337 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 332 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 45.22 సగటు 16,119 పరుగులు సాధించాడు.
ICC Champions Trophy: ఇండియాని ఓడించాలని పాక్ ఎంత రగిలిపోతుందో చూడండి.. పాక్ ప్రధాని మాటల్లో
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే ఓపెనర్‌గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఏడో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. 506 మ్యాచ్‌ల్లో 19,298 పరుగులు చేశాడు. ఆ తరువాత వరుసగా క్రిస్‌గేల్, డేవిడ్ వార్నర్, గ్రేమ్ స్మిత్ లు ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..
సనత్ జయసూర్య (శ్రీలంక) – 506 మ్యాచ్‌ల్లో 19298 పరుగులు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 441 మ్యాచ్‌ల్లో 18867 పరుగులు
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 374 మ్యాచ్‌ల్లో 18744 పరుగులు
గ్రేమ్ స్మిత్ (దక్షిణాప్రికా) – 342 మ్యాచ్‌ల్లో 16950 పరుగులు
డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్)- 354 మ్యాచ్‌ల్లో 16120 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 332 మ్యాచ్‌ల్లో 16119 పరుగులు
రోహిత్ శర్మ (భారత్) – 343 మ్యాచ్‌ల్లో 15,337* పరుగులు
సచిన్ టెండూల్కర్ (భారత్) – 346 మ్యాచ్‌ల్లో 15335 పరుగులు
IND vs ENG : సచిన్, ధోని, ద్రవిడ్ ఉన్న టీమ్ఇండియా ఎలైట్ ‘కెప్టెన్ క్లబ్’లోకి రోహిత్ శర్మ..
ఈ మ్యాచ్‌లో గుస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తరువాత రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో క్రిస్‌గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. 301 మ్యాచ్‌ల్లో గేల్ 331 సిక్సర్లు బాదగా రోహిత్ శర్మ కేవలం 267 మ్యాచ్‌లో 332 సిక్సర్లను కొట్టాడు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు..
షాహిద్ అఫ్రీది (పాకిస్థాన్) – 351 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 332 సిక్సర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 331 సిక్సర్లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 270 సిక్సర్లు
ఎంఎస్ ధోని (భారత్) – 229 సిక్సర్లు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 220 సిక్సర్లు