Rohit Sharma joins ms dhoni virat kohli in elite list
కటక్ వన్డే మ్యాచ్ ద్వారా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ కు 50వ మ్యాచ్. ఈ క్రమంలో వన్డేల్లో టీమ్ఇండియాకు 50కి పైగా మ్యాచుల్లో సారథ్యం వహించిన ఎనిమిదో ఆటగాడిగా హిట్‌మ్యాన్ ఘనత అందుకున్నాడు.
ఇక వన్డేల్లో భారత్‌కు అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని పేరిట ఉంది. అతడు 200 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఆ తరువాత అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ లు ఉన్నారు.
IND vs ENG : ఇదేం అన్యాయం సామీ.. కోహ్లీ కోసం యువ ఆటగాడు బలి.. ఒక్క మ్యాచ్‌కే..
భారత్‌కు అత్యధిక వన్డే మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్లు వీరే..
ఎంఎస్ ధోని – 200 మ్యాచ్‌లు
మహమ్మద్ అజారుద్దీన్ – 174 మ్యాచ్‌లు
సౌరవ్ గంగూలీ – 146 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ – 95 మ్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 79 మ్యాచ్‌లు
కపిల్ దేవ్ – 74 మ్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ – 73 మ్యాచ్‌లు
రోహిత్ శర్మ- 50* మ్యాచ్‌లు
సునీల్ గవాస్కర్ – 37 మ్యాచ్‌లు
వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడిన మ్యాచ్‌ల్లో (తాజాగా జరుగుతున్న మ్యాచ్ మినహాయించి) 35 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. మరో 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. స్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ పరుగులు..
వన్డేల్లో భారత కెప్టెన్‌గా రెండు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ను మినహాయిస్తే.. 49 మ్యాచ్‌ల్లో 53.80 సగటుతో 112.20 స్ట్రైక్ రేట్‌తో 2206 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (35), జాస్ బట్లర్ (1) లు క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. మోకాలి నొప్పితో తొలి వన్డేకు దూరం అయిన కోహ్లీ తిరిగి వచ్చేశాడు. అతడు యశస్వి జైస్వాల్ స్థానంలో ఆడుతున్నా డు. కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి ని తీసుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారానే వరుణ్ వన్డేల్లో అరంగ్రేటం చేశాడు.