IND vs ENG : కోహ్లీ ఔట్ వెనుక సాంకేతిక లోపం ఉందా? ఔటైన త‌రువాత విరాట్ ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌..

రెండో వ‌న్డే మ్యాచ్‌లో ఔటైన త‌రువాత విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్ష‌న్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

IND vs ENG 2nd ODI Tech Malfunction Behind Kohli Dismissal Virat Reaction Stuns All

టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో వ‌న్డేలో కోహ్లీ సింగిల్ డిజిట్‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. మోకాలి నొప్పి కార‌ణంగా నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో అత‌డు ఆడ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే.. ఎన్నో అంచ‌నాల‌తో రెండో వ‌న్డేలో బ‌రిలోకి దిగాడు కోహ్లీ. తొలి వికెట్ కు రోహిత్, గిల్ జోడి 136 ప‌రుగులు జోడించి శుభారంభాన్ని అందించారు.

గిల్ ఔట్ కావ‌డంతో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చాడు కోహ్లీ. ఓ వైపు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ దంచికొడుతుండ‌డంతో సాధించాల్సిన ర‌న్‌రేట్ ఒత్త‌డి లేని స‌మ‌యంలో కోహ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఛేద‌న కింగ్ అన్న పేరున్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడుతాడ‌ని అంతా భావించాడు. అందుకు త‌గ్గ‌ట్లే అట్కిన్స‌న్ బౌలింగ్‌లో క‌వ‌ర్‌డ్రైవ్‌తో ఫోర్ కొట్టాడు. అయితే.. కాసేప‌టికే ఔట్ అయ్యాడు. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ ఫిలిప్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

Rohit Sharma : రెండో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌.. వార్నీ ఇన్ని రికార్డుల‌ను బ్రేక్ చేశాడా.. స‌చిన్‌, ద్ర‌విడ్, గేల్ ..

వాస్త‌వానికి తొలుత అంపైర్ ఔట్ ఇవ్వ‌లేదు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. రీప్లేలలో అల్ట్రాఎడ్జ్ పై స్పైక్ క‌నిపించింది. దీంతో థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. రిప్లైను బిగ్ స్క్రీన్ పై చూస్తూ..అల్ట్రా ఎడ్జ్‌లో స్పైక్ క‌నిపించ‌గానే విరాట్ కోహ్లీ యానిమేటెడ్ రియాక్ష‌న్ ఇచ్చాడు.

కోహ్లీ స్పందన చూస్తే బంతి తన బ్యాట్‌ను తాకినట్లు అత‌డికి అనిపించలేదని అర్థమైంది. అది సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అంటే కోహ్లీ స్పందించిన తీరు చూస్తే అలాగే అనిపించ‌క మానదు. అయితే.. వాస్త‌వం మాత్రం బహుశా విరాట్ బ్యాట్‌కు బంతి తాకిన విష‌యాన్ని గ్ర‌హించ‌క‌పోవ‌చ్చు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జో రూట్‌ (69), డకెట్‌ (65), లివింగ్‌స్టన్‌ (41) లు రాణించడంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 304 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ష‌మీ, రాణా, పాండ్యా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలు త‌లా ఓ వికెట్ తీశారు.

IND vs ENG : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ పై సిరీస్ ఓట‌మి.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. మేం బాగానే ఆడాం..

అనంత‌రం ల‌క్ష్యాన్ని భార‌త్ 44.3 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంసక‌ర శ‌త‌కంతో విరుచుకుప‌డ్డాడు. అత‌డికి శుభ్‌మ‌న్ గిల్ (60), శ్రేయస్‌ అయ్యర్‌ (44) లు చ‌క్క‌ని స‌హ‌కారం అందించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ ర‌షీద్‌, లియామ్ లివింగ్ స్టోన్‌, గుస్ అట్కిన్సన్‌ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.