Akash Deep
IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు రెండోరోజు (గురువారం) ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిప్యతాన్ని ప్రదర్శించింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని రికార్డుల మోత మోగించాడు. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ అదరగొట్టాడు.. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో 269 పరుగులు చేశాడు. ఇందులో 30 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. రెండో రోజు రెండో సెషన్ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా బుమ్రా గైర్హాజరీతో తుదిజట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చాడు.
What a moment for #AkashDeep!🔥
2 wickets in 2 balls including the dangerous Ollie Pope, India in the driver’s seat! 🏏#ENGvIND 👉 2nd TEST, Day 2 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/hiGDPrqT1p pic.twitter.com/0fXOSKSJGg
— Star Sports (@StarSportsIndia) July 3, 2025
బజ్‌బాల్ ఆటతో చెలరేగుదామనుకున్న ఇంగ్లాండ్‌కు ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో చెక్ పెట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బంతుల్లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0)ను ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. మూడో స్లిప్ లో గిల్ అందుకున్న ఓ కళ్లు చెదిరే క్యాచ్ కు డకెట్ పెవిలియన్ బ్యాట్ పట్టాల్సివచ్చింది. ఓలీ పోప్ ప్లిక్ షాట్ ఆడాడు. ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని సెకండ్ స్లిప్ లో కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది. అయితే, బంతి అతని చేతులు తాకి మిస్సైంది. కానీ, రెండో ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో కేవలం 13 పరుగులకే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
SIRAJ: 5-2-9-1 🥶 WHAT A SPELL AT EDGBASTON…!!! pic.twitter.com/0qO0msRpRw
— Johns. (@CricCrazyJohns) July 3, 2025
కొద్దిసేపటికే జాక్ క్రాలీ (19) సిరాజ్ బౌలింగ్ లో స్లిప్ క్యాచ్ గా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత రూట్ (18 బ్యాటింగ్), బ్రూక్ (30 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.