IND vs ENG : ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ (IND vs ENG) జరగనుంది.
IND vs ENG 4th T20 Is Sanju Samson To Replace Vaibhav Sooryavanshi
- గురువారం బ్రిస్టల్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టీ20 మ్యాచ్
- భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే ఛాన్స్
IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు వరుస ఓటములతో తీవ్రంగా సతమతం అవుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో గురువారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు భారత్ సిద్ధం అవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో నిలబడాలని భారత్ పట్టుదలగా ఉంది.
తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా మూడో టీ20లో భారత జట్టు కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం తీవ్ర నిరాశ కలిగించింది. ఒక్క బ్యాటర్ కూడా కనీసం 15 పరుగులు దాటకపోవడంతో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరిస్థితుల్లో మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం జట్టు కూర్పులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs ENG : తెలుగోడిపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు..
15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మెరుపులు చూపించినప్పటికీ భారీ స్కోర్లను సాధించడంలో విఫలం అయ్యాడు. అతడు అరంగ్రేటం చేసిన మ్యాచ్‌లో 10 బంతుల్లో 14 పరుగులు చేయగా, ఆ తరువాతి మ్యాచ్‌లో 5 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి కూడా జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచే అవకాశంఉంది.
అభిషేక్ శర్మతో కలిసి మరోసారి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. ఇద్దరూ కొన్ని మంచి ఆరంభాలు చేసినప్పటికీ వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమయ్యారు. ఈసారి మాత్రం బాధ్యతాయుతమైన ఆటను ప్రదర్శించాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది.
మిడిల్ ఆర్డర్లో మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆశించిన స్థాయిలో రాణించని తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. టాప్ ఆర్డర్లో అనుభవం ఉన్న శాంసన్‌ను ఈసారి ఐదో స్థానంలో బరిలోకి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు శివమ్ దూబే, అక్షర్ పటేల్ తమ ఆల్‌రౌండ్ సామర్థ్యంతో జట్టుకు కీలకంగా మారనున్నారు.
MS Dhoni : వయసు అయిపోయింది.. నడవలేకపోతున్నా.. ధోని కామెంట్స్ వైరల్..
బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. వరుణ్ చక్రవర్తి ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు. హర్షిత్ రాణా కూడా తుది జట్టులో స్థానం నిలబెట్టుకునే అవకాశముంది. సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే భారత్ విజయాన్ని అందుకుంటుంది.
