IND vs NZ : ఒక్క బంతి కూడా ప‌డ‌కుండానే తొలి రోజు ఆట ర‌ద్దు..

అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. తొలి రోజు ఆట వ‌ర్షార్ప‌ణ‌మైంది.

IND vs NZ 1st Test Rain washes out first day of opener

IND vs NZ 1st Test : అనుకున్న‌ట్లుగానే జ‌రిగింది. తొలి రోజు ఆట వ‌ర్షార్ప‌ణ‌మైంది. బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొద‌టి రోజు ఆట‌లో ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు. క‌నీసం టాస్ వేసేందుకు వీలులేదు.

ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో మైదానం మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. టీ విరామం అనంత‌రం కూడా వ‌ర్షం ప‌డుతుండ‌డంతో తొలి రోజు ఆట‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు.

IND vs NZ : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శ‌ర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..

ఇక రెండో రోజు గురువారం కూడా మ్యాచ్ జ‌ర‌గ‌డం అనుమానంగానే ఉంది. రెండో రోజు కూడా 90 శాతం భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఇప్ప‌టికే భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇక మూడో రోజు శ‌క్ర‌వారం 67 శాతం, నాలుగో రోజు 25 శాతం, ఐదో రోజు 40 శాతం వ‌ర్షం కురిసే సూచ‌న‌లు ఉన్న‌ట్లు పేర్కొంది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై కన్నేసిన భారత్‌.. కివీస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. డ‌బ్ల్యూటీసీలో భార‌త్ ఇంకో ఎనిమిది (ఆసీస్‌తో 5 సహా) టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో అయిదు గెలిస్తే రోహిత్‌సేన ఎలాంటి సందిగ్ధతకు తావు లేకుండా నేరుగా ఫైనల్లో చోటు సంపాదిస్తుంది. క‌నీసం మూడు గెలిచినా ఛాన్స్ ఉంది.

Kamran Ghulam : పాకిస్థాన్ న‌యా బ్యాటింగ్ సంచ‌ల‌నం క‌మ్రాన్ గులామ్‌ను చెంప దెబ్బ కొట్టిన బౌల‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌.. పాత వీడియో వైర‌ల్‌