Ind Vs Nz 2nd Test
IND vs NZ 2nd Test : భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే స్టేడియం(ముంబై) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 70 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. 246 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ప్రస్తుతం మయాంక్, వృద్ధీమాన్ సాహా (25) క్రీజులో ఉన్నారు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 44 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, పుజారా విఫలం అయ్యారు. ఆ ఇద్దరూ డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 4 వికెట్లు తీశాడు.
డారిల్ మిచెల్ వేసిన 58.1 బంతికి ఫోర్ కొట్టి మయాంక్ అగర్వాల్ (100) శతకం అందుకున్నాడు. టెస్ట్ కెరీర్‌లో మయాంక్ కి ఇది 4వ సెంచరీ. 196 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో సెంచరీ చేశాడు.
Booster Dose : దేశంలో 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్!
కోహ్లి చెత్త రికార్డ్..
కెప్టెన్‌గా అత్యధిక సార్లు డకౌటైన వారిలో భారత సారథి విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్(13 సార్లు) తొలిస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (10 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పుడు స్మిత్ సరసన నిలిచాడు.
Winter Weight Loss : చలికాలంలో వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం ఎలా?
టీమిండియాను కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ గట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్‌లో పుజారా(0), విరాట్ కోహ్లీ(0)ని పెవిలియన్ పంపాడు. అతడు వేసిన 30వ ఓవర్‌లో తొలుత పుజారా బౌల్డ్ కాగా.. చివరి బంతికి కోహ్లి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కోహ్లీ ఔటని కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. అయితే, కోహ్లీ రివ్యూకు వెళ్లి ధీమాగా ఉండగా.. బంతి ప్యాడ్‌కు, బ్యాట్‌కు మధ్య ఒకేసారి తాకినట్లు థర్డ్ అంపైర్ తెలిపాడు. ఈ క్రమంలోనే బంతి వికెట్లకు తాకుతున్నట్లు రీప్లేలో తేలడంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి ఔటిచ్చారు. దీనిపై కోహ్లీ అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.
ఎన్నో ముఖ్యమైన మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన వాంఖడే స్టేడియంలో 2016 తర్వాత టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. చివరిసారి ఇక్కడ జరిగిన మ్యాచ్ (2016 డిసెంబర్ 8-12)లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడింది. భారత్ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఈ వేదిక మొత్తం 25 టెస్టులకు ఆతిథ్యమివ్వగా.. అందులో భారత్ 11 గెలిచింది. ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది. మిగతావి డ్రాగా ముగిశాయి. ఇక్కడ కివీస్ చివరిసారి 1988 నవంబర్ లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. అందులో 136 పరుగుల తేడాతో గెలిచింది. భారత్‌లో న్యూజిలాండ్ చివరిసారిగా నెగ్గిన టెస్టు అదే.
That moment when @mayankcricket got to his 4th Test Century ??
Live – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/GFXapG6GQo
— BCCI (@BCCI) December 3, 2021