IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 147.. ఆందోళనలో ఫ్యాన్స్

భారత్ జట్టు విజయం సాధించాలంటే 147 పరుగులు చేయాలి. అయితే, ఇక్కడ భారత్ అభిమానులు ఆందోళనకు గురిచేసే అంశం ఏమిటంటే..

TeamIndia

IND vs NZ 3rd Test Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ లో భాగంగా మూడో రోజు (ఆదివారం) ఆట ప్రారంభమైంది. 171 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో న్యూజిలాండ్ బ్యాటర్లు అజాజ్, విల్ ఓ రూర్కే క్రీజులోకి వచ్చారు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి 174 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా బౌలింగ్ లో అజాజ్ పటేల్ (8) ఔట్ అయ్యాడు. దీంతో జడేజా ఖాతాలో ఐదు వికెట్లు పడ్డాయి.

Also Read: IND vs NZ : 19 మీటర్ల దూరం పరుగెత్తి అశ్విన్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

న్యూజిలాండ్ జట్టు భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో జడేజా ఐదు వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్ (51) మినహా మిగిలిన బ్యాటర్లు ఎక్కువ పరుగులు రాబట్టలేక పోయారు. అశ్విన్ మూడు వికెట్లు, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: IND vs NZ: రిషబ్ పంత్ ఉండగా క్రీజును వదిలేస్తావా..! రిజల్ట్ అలానే ఉంటది మరి.. వీడియో వైరల్

భారత్ జట్టు విజయం సాధించాలంటే 147 పరుగులు చేయాలి. అయితే, ఇక్కడ భారత్ అభిమానులు ఆందోళనకు గురిచేసే అంశం ఏమిటంటే.. వాంఖడే స్టేడియంలో ఓ జట్టు విజయవంతంగా ఛేదించిన అతి పెద్ద లక్ష్యం 163 పరుగులు మాత్రమే. ఈ క్రమంలో 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ బ్యాటర్లు ఏ మేరకు ఛేదిస్తారనే అంశం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది.