IND vs NZ : 19 మీటర్ల దూరం పరుగెత్తి అశ్విన్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్
కివీస్ రెండో ఇన్నింగ్స్ లో డరిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ ను 38ఏళ్ల అశ్విన్ అద్భుతంగా డ్రైవ్ చేసి అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ravichandran Ashwin
Ravichandran Ashwin: న్యూజిలాండ్ తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటుతో, బాల్ తో రాణించడం ద్వారా మ్యాచ్ పై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) సూపర్ బ్యాటింగ్ తో కివీస్ జట్టుపై స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించిన టీమిండియా.. ఆ తరువాత బౌలింగ్ లో అదరగొట్టింది. జడేజా, రవిచంద్ర అశ్విన్ స్పిన్ మాయాజాలంకు కివీస్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. ఫలితంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. మరో వికెట్ మిగిలి ఉంది.
Also Read: IND vs NZ: రిషబ్ పంత్ ఉండగా క్రీజును వదిలేస్తావా..! రిజల్ట్ అలానే ఉంటది మరి.. వీడియో వైరల్
ఇదిలాఉంటే .. కివీస్ రెండో ఇన్నింగ్స్ లో డరిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ ను 38ఏళ్ల అశ్విన్ అద్భుతంగా డ్రైవ్ చేసి అందుకున్నాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్ అయిదో బంతికి భారీ షాట్ ఆడేందుకు మిచెల్ ప్రయత్నం చేశాడు. అయితే, బంతి బ్యాట్ కింది భాగంలో తాకడంతో గాల్లోకి ఎగిరింది. ఆ బ్యాల్ ను క్యాచ్ పట్టేందుకు అశ్విన్ మిడాఫ్ నుంచి వెనక్కి పరుగెత్తాడు. అలా సుమారు 19 మీటర్ల దూరం పరుగెత్తి చివరకు డ్రైవ్ చేసి బంతిని ఒడిసి పట్టాడు. అశ్విన్ సూపర్ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ను చూసిన నెటిజన్లు అశ్విన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
38-YEAR-OLD ASHWIN TOOK A STUNNER 🥶 pic.twitter.com/SfHUbuAgsp
— Johns. (@CricCrazyJohns) November 2, 2024