IND vs NZ: రిషబ్ పంత్ ఉండగా క్రీజును వదిలేస్తావా..! రిజల్ట్ అలానే ఉంటది మరి.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యం సాధించిన

Rishabh Pant stumped Rachin Ravindra
Rachin Ravindra: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యం సాధించిన భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బౌలర్లకు భారత స్పిన్నర్లు చుక్కలు చూపిస్తున్నారు. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ దాటికి కివీస్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. ఫలితంగా 148 పరుగులకే కివీస్ ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే, కివీస్ కీలక బ్యాటర్లలో ఒకరైన రచిన్ రవీంద్ర ను కీపర్ రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌పై మూడో టెస్టులో సరికొత్త రికార్డును నమోదు చేసిన రిషబ్ పంత్..
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో 14వ ఓవర్ లో అశ్విన్ బౌలింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ లో రచిన్ రవీంద్ర క్రీజును వదిలి ముందుకొచ్చి భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు.. కానీ, బాల్ మిస్ కావడంతో వికెట్ల వెనకాల ఉన్న రిషబ్ పంత్ అంతేవేగంతో బాల్ ను అందుకొని స్టంపౌట్ చేశాడు. రచిన్ రవీంద్ర తిరిగి క్రీజులోకి వెళ్లేందుకు డ్రైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వికెట్ల వెనకాల పంత్ ఉన్నాడని తెలిసికూడా క్రీజు వదిలి ముందుకెళ్తావా..! రిజల్ట్ అంతే ఉంటది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
RAVI ASHWIN GETS RACHIN. 🤯🔥 pic.twitter.com/9sKXmRgep5
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024