IND vs NZ: న్యూజిలాండ్‌పై మూడో టెస్టులో సరికొత్త రికార్డును నమోదు చేసిన రిషబ్ పంత్..
ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు.

Rishabh Pant
Rishabh Pant: ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు. మూడో టెస్టు మ్యాచ్ శుక్రవారం వాంఖడేలో స్టేడియంలో ప్రారంభమైంది. తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా.. తొలిరోజే 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు తొలిరోజు 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండోరోజు మ్యాచ్ లో రిషబ్ పంత్ (60), శుభ్ మన్ గిల్ (90) రాణించడంతో భారత్ జట్టు 263 పరుగులు చేయగలిగింది. దీంతో కివీస్ జట్టుపై తొలి ఇన్నింగ్స్ లో 28 పరుగుల ఆధిక్యం సాధించింది.
Also Read: India vs New Zealand: 263 పరుగులకే టీమిండియా ఆలౌట్
తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ దుకుడైన ఆటతీరుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఫలితంగా 36బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఇందులో ఏడు బౌండరీలు, రెండు సిక్సులు కూడా ఉన్నాయి. తద్వారా టెస్ట్ క్రికెట్ లో న్యూజిలాండ్ పై భారతీయ బ్యాటర్లలో అత్యంత వేగవంతమైన ఆఫ్ సెంచరీని నమోదు చేశాడు. పుణెలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓ ఇన్నింగ్స్ లో యశస్వీ జైస్వాల్ 41 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. పంత్ ఇంతుకుముందు 2022లో బెంగళూరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 28 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా టెస్టుల్లో వేగవంతమైన ఆఫ్ సెంచరీ చేసిన భారతీయ బ్యాటర్ గా రికార్డు నమోదు చేశారు.
ఇదిలాఉంటే టెస్టు క్రికెట్ లో వేగవంతమైన ఆప్ సెంచరీ చేసిన రికార్డు పాకిస్థాన్ బ్యాటర్ మిస్బా-ఉల్- హసన్ పేరుపై ఉంది. 2014లో అబుదాబి వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మిస్బా-ఉల్- హసన్ 21 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు.
FIFTY IN JUST 36 BALLS BY RISHABH PANT…!!! 🤯
– What a knock by Pant, a blockbuster guy in Test cricket! pic.twitter.com/hMVmewd84b
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024