India vs New Zealand: 263 పరుగులకే టీమిండియా ఆలౌట్
న్యూజిలాండ్ నిన్న 235 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 263 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిన్న 235 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 28 పరుగుల లీడ్‌లో ఉంది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 30, రోహిత్ శర్మ 18, శుభ్‌మన్ గిల్ 90, మొహమ్మద్ సిరాజ్ 0, విరాట్ కోహ్లీ 4, రిషబ్ పంత్ 60, రవీంద్ర జడేజా 14, సర్ఫరాజ్ ఖాన్ 0, వాషింగ్టన్ సుందర్ 38(నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ 6, ఆకాశ్ దీప్ 0 పరుగులు చేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్‌కు 5 వికెట్లు దక్కాయి. అలాగే, గ్లెన్ ఫిలిప్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోది తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా ఇప్పటికే రెండు టెస్టు మ్యాచుల్లోనూ ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్‌లోనైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.