×
Ad

IND vs SA : విజృంభించిన జ‌డేజా.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో ద‌క్షిణాఫ్రికా.. ముగిసిన రెండో రోజు ఆట‌

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా భార‌త్‌, దక్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న (IND vs SA) తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది.

IND vs SA 1st Test Day 2 Stumps South Africa lead by 63 runs

IND vs SA : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా భార‌త్‌, దక్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. భార‌త స్పిన్న‌ర్ల ధాటికి ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు.

రెండో రోజు ఆట (IND vs SA) ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 97 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం స‌ఫారీలు 63 ప‌రుగుల ఆధిక్యంలో ఉన్నారు. కోర్బిన్ బాష్ (1), టెంబా బ‌వుమా (29) క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా నాలుగు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్ ఓ వికెట్ సాధించాడు.

Mohammed Shami : స‌న్‌రైజ‌ర్స్ నుంచి ల‌క్నోకు ష‌మీ.. రూ.10 కోట్లకు.. ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఏమ‌న్నాడో తెలుసా?

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 37/1తో రెండో రోజు ఆటను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 152 ప‌రుగులు జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 189 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ కు 30 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (39) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్‌ పంత్ (27), రవీంద్ర జడేజా (27) ప‌ర్వాలేద‌నిపించారు.

Ravindra Jadeja : అందుక‌నే జ‌డేజాను వ‌దిలివేశాం.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వ‌నాథన్‌..

ఇక టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ బ్యాటింగ్ చేస్తుండ‌గా మెడ ప‌ట్టేయ‌డంతో రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయ‌గా.. మార్కో జాన్సెన్ మూడు, కేశవ్‌ మహరాజ్‌, కోర్బిన్‌ బోష్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.