Mohammed Shami : స‌న్‌రైజ‌ర్స్ నుంచి ల‌క్నోకు ష‌మీ.. రూ.10 కోట్లకు.. ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఏమ‌న్నాడో తెలుసా?

ట్రేడింగ్ ద్వారా ష‌మీ (Mohammed Shami )స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ నుంచి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌లోకి చేరాడు.

Mohammed Shami : స‌న్‌రైజ‌ర్స్ నుంచి ల‌క్నోకు ష‌మీ.. రూ.10 కోట్లకు.. ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా ఏమ‌న్నాడో తెలుసా?

Sanjiv Goenka Cheeky Message To Mohammed Shami After Rs 10 Crore Trade

Updated On : November 15, 2025 / 3:21 PM IST

Mohammed Shami : ఐపీఎల్ 2026 వేలానికి ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీమ్ఇండియా వెట‌ర‌న్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని ట్రేడ్ ద్వారా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఇచ్చేసింది. ప్ర‌స్తుత ఫీజు రూ.10 కోట్ల‌తోనే ష‌మీ ల‌క్నోలో చేరాడు. ఈ సంద‌ర్భంగా ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

‘న‌వ్వండి.. ఇప్పుడు మీరు ల‌క్నోలో ఉన్నారు. సూప‌ర్ జెయింట్స్ కుటుంబంలోకి మీకు స్వాగ‌తం.’ అంటూ ష‌మీతో ఉన్న ఫోటోను సంజీవ్ గొయెంకా పోస్ట్ చేశాడు.

IND vs SA : మ‌రోసారి బ్యాటింగ్‌కు రాని గిల్.. ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్‌.. స్వ‌ల్ప ఆధిక్యంలో టీమ్ఇండియా..

ఐపీఎల్‌లో ష‌మీకి ఎంతో అనుభ‌వం ఉంది. అత‌డు కోల్‌కతా నైట్ రైడర్స్ (2013-14), ఢిల్లీ క్యాపిటల్స్ (2016-18), పంజాబ్ కింగ్స్ (2019-21), గుజరాత్ టైటాన్స్ (2022-23), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2025) జ‌ట్ల త‌రుపున ఆడాడు. మొత్తం త‌న కెరీర్‌లో 119 ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఆడి 28.18 స‌గ‌టుతో 133 వికెట్లు సాధించాడు. అత్యుత్త‌మ‌ గణాంకాలు 4/11.

Ravindra Jadeja : అందుక‌నే జ‌డేజాను వ‌దిలివేశాం.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వ‌నాథన్‌..

ఐపీఎల్ 2025 మెగావేలంలో ష‌మీని స‌న్‌రైజ‌ర్స్ రూ.10 కోట్ల‌కు సొంతం చేసుకుంది. అయితే.. ఈ సీజ‌న్‌లో ష‌మీ నిరాశ‌ప‌రిచాడు. 56.16 స‌గ‌టుతో కేవ‌లం 6 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. 11.23 ఎకాన‌మీతో ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ష‌మీ స‌న్‌రైజ‌ర్స్ రిటైన్ చేసుకోలేదు. ల‌క్నోకు ట్రేడింగ్‌లో అమ్మేసింది.