IND vs SA Rohit Sharma Refuses To Eat Cake video viral
Rohit Sharma : విశాఖ వేదికగా శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. విశాఖ మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన తరువాత హోటల్ కు చేరుకున్నప్పుడు జట్టుకు ఘన స్వాగతం లభించింది. విజయానికి గుర్తుగా యశస్వి జైస్వాల్ కేట్ కట్ చేశాడు.
తొలి ముక్కను సీనియర్ ఆటగాడు కోహ్లీకి తినిపించాడు. ఆ తరువాత మరో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma)కు కేక్ పీస్‌ను తినిపించబోగా అతడు నిరాకరించాడు. ‘మళ్లీ లావు అవుతాను’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gautam Gambhir : ఎవరి పని వారు చేసుకుంటే మంచిది.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్‌పై గంభీర్ ఆగ్రహం..
టీ20లకు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా అతడు ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌ను మరింతగా మెరుగుపరచుకున్నాడు. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటి నుంచి అతడు 10 కిలోలకు పైగా బరువు తగ్గాడు. తన ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ చిన్న కేకు ముక్కను తినేందుకు నిరాకరించాడు.
After India’s win in Vizag, the team was celebrating at the hotel by cutting a victory cake. When Jaiswal went to feed the cake to Rohit Sharma, Rohit said, “nahi bhai, me Mota ho jauga vapas”😭❤️
bRO is following a very strict diet.🫡🔥 pic.twitter.com/UGlHGHQdoY
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 7, 2025
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. రెండో వన్డే మ్యాచ్‌లో 14 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్‌లో 73 బంతుల్లోనే 75 పరుగులు సాధించి భారత్ జట్టు సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.