×
Ad

Ind VS Sri Lanka : లంక కోచ్ వర్సెస్ కెప్టెన్, మాటల యుద్ధం!

డ్రెసింగ్ రూమ్ లో ఉన్న ఆర్థర్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ చివరిలో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ సందర్భంలో మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చారు. అనంతరం కెప్టెన్ షనకతో ఏదో మాట్లాడారు.

Team India

Arthur And Captain Shanaka : ఏదైనా క్రీడల్లో ఓటమి, గెలుపులు సహజం. కానీ కొంతమంది ఓటమిని జీర్ణించుకోలేకపోతుంటారు. క్రీడా మైదానంలోనే హల్ చల్ చేస్తుంటారు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో…లంక కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది. అనంతరం జట్టు కెప్టెన్ దాసున్ షనకతో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇరువురి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Read More : RS Praveen Kumar: ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ కసరత్తు మొదలు!

టీమిండియా జట్టు శ్రీలకం టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తెగ ఉత్కంఠకు గురి చేసింది. ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది టీమిండియా. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్న సమయంలో శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ డ్రెసింగ్ రూమ్ లో సంతోషంగా కనిపించారు.

Read More : Miss Universe : ఇజ్రాయెల్ లో 2021 ప్రపంచ సుందరి పోటీలు …వ్యాక్సిన్ చేయించుకున్న వారికే అనుమతి

క్రమంగా..టీమిండియా బాట్స్ మెన్ చాహర్ నిలదొక్కకుని ఆడడం, భువీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించడంతో భారత్ విజయానికి చేరువైంది. ఈ సమయంలో డ్రెసింగ్ రూమ్ లో ఉన్న ఆర్థర్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. మ్యాచ్ చివరిలో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ సందర్భంలో మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చారు. అనంతరం కెప్టెన్ షనకతో ఏదో మాట్లాడారు.

Read More : Women Handball : బికినీలు వేసుకోకుండా ఆడారని..మ‌హిళా హ్యాండ్‌బాల్ జ‌ట్టుకు భారీ జ‌రిమానా

ఆర్థర్ ఏవో సైగలు చేస్తుండగా..షనక ఘాటుగానే రిప్లై ఇవ్వడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో దర్శనమిచ్చింది. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు ఎవరికి తోచినట్లు కామెంట్స్ చేస్తున్నారు. కోచ్ మైదానంలోకి అడుగు పెట్టడం సరైంది కాదని, టీమిండియా బ్యాట్స్ మెన్స్ ను డిస్ట్రబ్ చేయాలనే ఆర్థర్ ఇలా ప్లాన్ చేసి ఉంటారని వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.