Women Handball : బికినీలు వేసుకోకుండా ఆడారని..మ‌హిళా హ్యాండ్‌బాల్ జ‌ట్టుకు భారీ జ‌రిమానా

బ‌ల్గేరియాలోని వ‌ర్నాలో ఇటీవ‌ల యురోపియ‌న్ బీచ్ హ్యాండ్ చాంపియ‌న్‌షిప్ టోర్నీలో పాల్గొన్న నార్వే మ‌హిళ‌ల హ్యాండ్‌బాల్ జ‌ట్టుకు యురోపియ‌న్ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ భారీ జ‌రిమానా విధించింది. టోర్నీలో బికినీలు వేసుకోకుండా మ్యాచ్‌లు ఆడినందుకు ఆ జ‌ట్టుకు 1500 యూరోలు జరిమానా విధించారు.

Women Handball : బికినీలు వేసుకోకుండా ఆడారని..మ‌హిళా హ్యాండ్‌బాల్ జ‌ట్టుకు భారీ జ‌రిమానా

Norway Women Handball Team Fined

Norway Women Handball Team Fined : బ‌ల్గేరియాలోని వ‌ర్నాలో ఇటీవ‌ల యురోపియ‌న్ బీచ్ హ్యాండ్ చాంపియ‌న్‌షిప్ టోర్నీలో పాల్గొన్న నార్వే మ‌హిళ‌ల హ్యాండ్‌బాల్ జ‌ట్టుకు యురోపియ‌న్ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ భారీ జ‌రిమానా విధించింది. టోర్నీలో బికినీలు వేసుకోకుండా మ్యాచ్‌లు ఆడినందుకు ఆ జ‌ట్టుకు సోమవారం (జులై 19,2021) 1500 యూరోలు జరిమానా విధించారు. దీనిపై నార్వే అధికారులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

హ్యాండ్‌బాల్ టోర్నీ రూల్స్ ప్ర‌కారం.. మ‌హిళా ప్లేయ‌ర్లు బికినీలు వేసుకోవాలి. కానీ ఆ జ‌ట్టు ప్లేయ‌ర్స్ షార్ట్స్ వేసుకుని మ్యాచ్ ఆడారు. టోర్నీలో స‌రైన దుస్తులు ధ‌రించ‌లేద‌ని..ఇది క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనని నార్వే జ‌ట్టుకు ఈహెచ్ఎఫ్ జ‌రిమానా విధించింది. ఆ జ‌ట్టుకు 1500 యూరోలు ఫైన్ వేశారు. ఒక్కొక్క ప్లేయ‌ర్‌కు 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంద‌ని అన్నారు.

కాగా..హ్యాండ్‌బాల్ టోర్నీ రూల్స్ ప్ర‌కారం.. మ‌హిళా ప్లేయ‌ర్లు బికినీలు వేసుకోవాలి. ఫిట్‌ గా ఉంటూ..కాలు పైభాగానికి పైకి కోణంలో కత్తిరించాలి.బాటమ్స్ నాలుగు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. పురుషులు ట్యాంక్ టాప్స్ మరియు షార్ట్స్ ధరిస్తారు.నార్వే ఫెడరేషన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..మహిళలు తమకు ఇష్టమైన.. సౌకర్యవంతమైన దుస్తులు ధరించి ఆడినందుకు మాకు గర్వంగా ఉంది.మేము NHF మీ వెనుక నిలబడి మీకు మద్దతు ఇస్తున్నాము. దుస్తులు విషయంలో నియమాలను మార్చడానికి పోరాటం కొనసాగిస్తామని..తద్వారా ఆటగాళ్ళు వారికి సౌకర్యంగా ఉండే దుస్తులలో ఆడవచ్చు అని తెలిపింది.