Miss Universe : ఇజ్రాయెల్ లో 2021 ప్రపంచ సుందరి పోటీలు …వ్యాక్సిన్ చేయించుకున్న వారికే అనుమతి

2021 ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఇజ్రాయెల్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన వివరాలను మిస్ యూనివర్స్ సంస్ధ వెల్లడించింది.

Miss Universe : ఇజ్రాయెల్ లో 2021 ప్రపంచ సుందరి పోటీలు …వ్యాక్సిన్ చేయించుకున్న వారికే అనుమతి

Miss Universe

Miss Universe : 2021 ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఇజ్రాయెల్ వేదిక కానుంది. దీనికి సంబంధించిన వివరాలను మిస్ యూనివర్స్ సంస్ధ వెల్లడించింది. 70వ ఎడిషన్ పోటీ ఈ ఏడాది జరగనుంది. ఇజ్రాయెల్ లోని రిసార్ట్ నగరం ఎలియాత్ లో ప్రపంచ సుందరి ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నారు.

గత ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా సొంతం చేసుకున్నారు. 26 ఏళ్ళ మేజా మిస్ యూనివర్స్ గా ఎంపికైన మూడో మెక్సికన్. ఈసారి జరగనున్న పోటీలల్లో మిస్ యూనివర్స్ గా ఎంపికైన వారికి ఆండ్రియా మెజా కిరీటాన్ని బహుకరించనున్నారు. ఇజ్రాయెల్ లో డిసెంబర్ మాసంలో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

కరోనా పరిస్ధితుల నేపధ్యంలో ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు సంబంధించి నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ చేయించుకున్న వారినే అనుమతించాలన్న నిర్ణయంలో ఉన్నారు. కార్యక్రమానికి హాజరుకావాలనుకునే వారు ముందుగానే కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకుని సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఫాక్స్ ఛానల్ 3గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.