×
Ad

IND vs WI : ముగిసిన రెండో రోజు ఆట‌.. శ‌త‌కాల‌తో చెల‌రేగిన కేఎల్ రాహుల్‌, జురెల్‌, జ‌డేజా.. 286 ప‌రుగుల ఆధిక్యంలో భార‌త్‌..

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ (IND vs WI ) ప‌ట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 286 ప‌రుగుల ఆధిక్యంలో..

IND vs WI 1st test Day 2 Stumps India lead by 286 runs

IND vs WI : అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 448 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (104), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (9) లు క్రీజులో ఉన్నారు. భార‌త్ ప్ర‌స్తుతం 286 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 ప‌రుగుల‌కే ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

327 ప‌రుగులు 3 వికెట్లు..

ఓవ‌ర్ నైట్ స్కోరు 121/2తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన భార‌త్ మ‌రో 327 ప‌రుగులు జోడించి మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్లు గిల్ (18), కేఎల్ రాహుల్ (53) లు రెండో రోజు విండీస్ బౌల‌ర్ల‌ను సమ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. హాఫ్ సెంచ‌రీ సాధించిన త‌రువాత గిల్ (50) లంచ్ విరామానికి కాసేప‌టి ముందు రోస్ట‌న్ ఛేజ్ బౌలింగ్‌లో జ‌స్టిన్ గ్రేవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. గిల్, రాహుల్ జోడీ మూడో వికెట్‌కు 98 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది.

Chappell Hadlee Trophy : ఆస్ట్రేలియాకు వ‌రుణుడి సాయం.. చాపెల్-హాడ్లీ ట్రోఫీని నిలబెట్టుకుంది

తొలి రోజు హాఫ్ సెంచ‌రీ చేసిన కేఎల్ రాహుల్ రెండో రోజూ త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌ట్టాడు. లంచ్ విరామానికి కొన్ని నిమిషాల ముందు శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇది 11వ సెంచ‌రీ కాగా.. సొంత గ‌డ్డ‌పై మాత్రం రెండోది కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. లంచ్ త‌రువాత తొలి ఓవ‌ర్‌లోనే అత‌డు ఔట్ అయ్యాడు.

ద్విశ‌త‌క బాగ‌స్వామ్యం..
స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో గిల్‌, రాహుల్ ఔట‌న‌ప్ప‌టికి.. వికెట్ కీప‌ర్ ధ్రువ్ జురెల్‌, ర‌వీంద్ర జ‌డేజా విండీస్ బౌల‌ర్ల పై విరుచుకుప‌డ్డారు. ఇద్ద‌రూ పోటాపోటీగా ప‌రుగులు సాధించారు. తొలుత ధ్రువ్ జురెల్ (125) సెంచ‌రీ సాధించాడు. అనంత‌రం దూకుడుగా ఆడుతూ ఖరీ పియర్ బౌలింగ్‌లో షై హోప్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. జ‌డేజా, ధ్రువ్ జురెల్ జోడి ఐదో వికెట్‌కు 206 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

Abhishek Sharma : విఫ‌ల‌మైన అభిషేక్ శ‌ర్మ.. గోల్డెన్ డ‌క్‌.. టీ20ల్లోనే మ‌నోడి ప్రతాప‌మంతా! వ‌న్డేల్లో తుస్సే..!

జురెల్ ఔటైన కాసేప‌టికే జడేజా కూడా టెస్టుల్లో త‌న ఆరో సెంచ‌రీని న‌మోదు చేశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా రెండో రోజును ముగించారు.