IND vs AFG : సూర్య మెరుపులు.. బుమ్రా నిప్పులు.. అఫ్గానిస్తాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది.

India vs Afghanistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. సూప‌ర్‌-8లో అఫ్గానిస్తాన్ పై 47 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో మొద‌ట సూర్య‌కుమార్ యాద‌వ్ చెల‌రేగ‌గా.. ఆత‌రువాత బౌలింగ్‌లో బుమ్రా నిప్పులు చెరిగాడు.

ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాదాడు. హార్దిక్ పాండ్యా(32; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(8) విఫ‌ల‌మైనా కోహ్లి (24), పంత్ (20) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Quinton de Kock : క్వింట‌న్ డికాక్ అరుదైన ఘ‌న‌త‌..

అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్(26; 20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌) టాప్ స్కోరర్‌. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు తీశారు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా త‌లా ఓ వికెట్ సాధించారు.

నిప్పులు చెరిగిన బుమ్రా..

లక్ష్య ఛేద‌న‌కు దిగిన అఫ్గానిస్తాన్‌కు బుమ్రా చుక్క‌లు చూపించాడు. అత‌డి బౌలింగ్‌లో షాట్ ఆడ‌డం సంగ‌తి అటుంచితే వికెట్ ఇవ్వ‌కుండా బంతిని కాచుకోవ‌డ‌మే అఫ్గాన్ బ్యాట‌ర్ల‌కు స‌వాల్‌గా మారింది. వ‌రుస ఓవ‌ర్ల‌లో అఫ్గాన్ ఓపెన‌ర్లు రెహ్మానుల్లా గుర్బాజ్(11), జ‌జాయ్ (2) పెవిలియ‌న్‌కు చేర్చి అఫ్గానిస్తాన్ ప‌తానానికి నాంది ప‌లికాడు. ఇబ్రహీమ్ జడ్రాన్(8)ను అక్షర్ పటేల్ ఔట్ చేయ‌డంతో 23 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి అఫ్గానిస్తాన్ క‌ష్టాల్లో ప‌డింది.

Team India : టీమ్ఇండియా హోమ్ సీజ‌న్ 2024-25 షెడ్యూల్ వ‌చ్చేసింది.. హైద‌రాబాద్‌లో ఒకే ఒక టీ20 మ్యాచ్‌..

అయితే.. నైబ్ (17), అజ్మ‌తుల్లా (26), న‌జిబుల్లా(19), న‌బీ (14) జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారి పోరాటం జ‌ట్టును స్కోరును వంద దాటించ‌డానికి స‌రిపోయింది. ఆఖ‌ర్లో అర్ష్‌దీప్ సింగ్ చెల‌రేగాడు. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు తీసి అఫ్గానిస్తాన్ క‌థ ముగించాడు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవ‌ర్లు వేసి కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. మూడు వికెట్లు తీశాడు. ఓ మెయిడిన్ ఓవ‌ర్ కూడా వేయ‌డం విశేషం.

ట్రెండింగ్ వార్తలు