Asian Games 2023: ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్.. క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ..

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 100 పతకాలు సాధించింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్.. క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ..

Asian Games 2023

Updated On : October 7, 2023 / 9:49 AM IST

Asian Games 2023 India Win 100 Medals: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 100 పతకాలు సాధించింది. శనివారం మహిళల కబడ్డీ ఫైనల్ లో చైనీస్ జట్టును ఓడించిన భారత్ స్వర్ణంతో మెరిసింది. అదేవిధంగా ఆర్చరీ ఈవెంట్ లో నాలుగు పతకాలను భారత్ సాధించింది. శనివారం ఒక్కరోజే భారత్ మూడు బంగారు పతకాలు సాధించింది. రెండు ఆర్చరీలో రాగా, మరో స్వర్ణ పతకం కబడ్డీలో వచ్చింది. ఫలితంగా భారత్ 100 పతకాల క్లబ్ లోకి చేరింది. వీటిలో స్వర్ణ 25, రజతం 35, కాంస్యం 40 మెడల్స్ ఉన్నాయి.

Read Also : Asian Games : ఆసియా విలువిద్య క్రీడలో జ్యోతికి బంగారు పతకం

100 పతకాలతో భారత్ ఆసియా క్రీడల పతకాల పట్టికలో నాల్గో స్థానంలోకి దూసుకెళ్లింది. ఇండోనేషియాలో గత ఎడిషనల్ (2018)లో భారత్ 70 పతకాలను గెలుచుకుంది. వీటిలో 16 బంగారు పతకాలు కాగా 23 రజతాలు, 31 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడలు 2023లో చైనా 358 పతకాలతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. జపాన్ 169, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 172 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇండియా 100 పతకాలతో నాల్గో స్థానంలోకి కొనసాగుతుంది.

Read Also : Who Is Rachin Ravindra : ర‌చిన్ ర‌వీంద్ర ఎవ‌రు..? స‌చిన్‌, రాహుల్ ద్ర‌విడ్‌ల‌తో ఉన్న సంబంధం ఏంటి..?

ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు 100 పతకాలు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. మోదీ ట్విట్ ప్రకారం.. ఆసియా క్రీడల్లో భారత్ కు అద్భుత విజయం దక్కింది. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. క్రీడాకారుల అద్భుత ప్రదర్శన భారత ప్రజల హృదయాలను గర్వంతో నింపింది. నేను 10వ తేదీన ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, మన అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాను. అంటూ మోదీ ట్వీట్ చేశారు.