Karn Sharma : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కర్ణ్ శర్మ
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కర్ణ్ శర్మ (Karn Sharma) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
India leg spinner Karn Sharma announced from cricket
Karn Sharma : టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కర్ణ్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ అంతర్జాతీయ, దేశవాళీతో పాటు అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కర్ణ్ శర్మ టీమ్ఇండియా తరుపున ఓ టెస్టు, రెండు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ప్రస్తుతం అతడు యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆగస్టు 25న మీరట్ మావెరిక్స్‌తో జరగనున్న మ్యాచే తన కెరీర్లో చివరిది అని చెప్పుకొచ్చాడు.
‘నేను ఇప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి, బీసీసీఐకి, రైల్వేస్‌కు, యూపీసీఏకు, ఆంధ్ర, విదర్భ క్రికెట్ అసోసియేషన్‌కు, ప్రతి ఒక్కరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘అని కర్ణ్ శర్మ తెలిపాడు.
IND vs SL : దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ.. ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్..
రిటైర్మెంట్ తరువాత తాను కోచింగ్, క్రికెట్‌కు సంబంధించిన ఇతర బాధ్యతలు చేపట్టడానికి అందుబాటులో ఉంటానని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా రాణించకపోయినప్పటికి ఐపీఎల్లో మంచి ప్రదర్శననే చేశాడు. 90 మ్యాచ్‌ల్లో 83 వికెట్లు పడగొట్టాడు. మూడు వేరు వేరు జట్లతో వరుసగా మూడు ఐపీఎల్ టైటిల్లు సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తరుపున ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడాడు.
97 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 27.60 సగటుతో 270 వికెట్లు పడగొట్టాడు. అతను 138 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో 2,866 పరుగులు కూడా సాధించాడు. 123 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో,53 వికెట్లు తీశాడు.
