Shubman Gill : టెస్టుల్లో శుభ్మన్ గిల్ అరుదైన ఘనత..
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు.
IND vs SL 2nd Test Shubman Gill joins Sachin and Sehwag in elite test list
Shubman Gill : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. సుధీర్ఘ ఫార్మాట్లో 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. ఈ మైలురాయిని సాధించిన అతి పిన్న వయస్కుడైన నాలుగో భారత ఆటగాడిగానూ రికార్డుకు ఎక్కాడు,.
గిల్ ఈ ఘనతను 26 ఏళ్ల 349 రోజుల వయస్సులో సాధించాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్ సర్కార్లు గిల్ కంటే తక్కువ వయసులోనే టెస్టుల్లో 3 వేల పరుగులు సాధించారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 23 ఏళ్ల 228 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు.
అతి పిన్న వయస్సులో టెస్టుల్లో 3 వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
- సచిన్ టెండూల్కర్ – 23 ఏళ్ల 228 రోజులు
- వీరేంద్ర సెహ్వాగ్ – 26 ఏళ్ల 157 రోజులు
- దిలీప్ వెంగ్సర్కార్ – 26 ఏళ్ల 263 రోజులు
- శుభ్మన్ గిల్ – 26 ఏళ్ల 349 రోజులు
- కపిల్ దేవ్ – 26 సంవత్సరాల 356 రోజులు
🚨 Milestone Alert 🚨
3⃣0⃣0⃣0⃣ runs and counting in Test Cricket for Captain Shubman Gill!
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/D4Xsx7putR
— BCCI (@BCCI) August 23, 2026
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గిల్ 108 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి అసితా ఫెర్నాండో బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
