ఇంగ్లాండ్‌‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తాడా..? అందరిచూపు అతనివైపే.. 26ఏళ్ల ఆశ నెరవేరుతుందా..

ఈ మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో బౌండరీల వర్షం కురిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ సిక్సర్ల మోత మోగిస్తాడా..

Vaibhav Suryavanshi

India U19 vs England Lions: భారత్ అండర్ -19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ లయన్స్‌తో ఐదు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. తొలి మ్యాచ్ జూన్ 27 (శుక్రవారం) నుంచి హోవ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో బౌండరీల వర్షం కురిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ సిక్సర్ల మోత మోగిస్తాడా.. అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: అయ్యో.. ఇంత మాట అనేసిందేంటి భయ్యా..? బుమ్రాను ట్రోల్ చేసిన భార్య సంజన.. పాపం బుమ్రా ఫేస్ చూశారా.. వీడియో వైరల్..

ఆయుష్ మాత్రే సారథ్యంలో ఇండియా-19 క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ యంగ్ లయన్స్‌తో తలపడనుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హోవ్స్ కౌంటి గ్రౌండ్ లో జరుగుతుంది. భారత సీనియర్, జూనియర్ జట్లు రెండు ఎప్పుడూ ఈ మైదానంలో గెలవలేదు. మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత జట్టు చివరిసారిగా 1999 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆడింది. ఆ సమయంలో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ సహా ఇండియా -19 జట్టు ప్లేయర్లు 26ఏళ్ల చరిత్రను తిరగరాస్తారా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ కొనసాగిస్తే విజయం ఈజీ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

2024 సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసి (13 సంవత్సరాల 188 రోజులు వయస్సు) అద్భుతమైన సెంచరీ సాధించాడు. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్ లో కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి అందరి దృష్టిని సూర్యవంశీ ఆకర్షించాడు. ఐపీఎల్ -2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగ్రేటం చేసిన సూర్యవంశీ.. మొత్తం ఏడు మ్యాచ్ లలో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ పిచ్ పై ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తాడు. సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు ఇంగ్లాండ్ లయన్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో వైభవ్ 13 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అయితే, ఇంగ్లాండ్ తో సిరీస్ లోవైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో అదరగొట్టడం ఖాయమని క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

మ్యాచ్ ల షెడ్యూల్ ..
♦ జూన్ 27, 1వ వన్డే – కౌంటీ గ్రౌండ్, హోవ్ – మధ్యాహ్నం 3:30
♦ జూన్ 30, 2వ వన్డే – కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ – మధ్యాహ్నం 3:30
♦ జూలై 2, 3వ వన్డే – కౌంటీ గ్రౌండ్, నార్తాంప్టన్ – మధ్యాహ్నం 3:30
♦ జూలై 5, 4వ వన్డే – కౌంటీ గ్రౌండ్, న్యూ రోడ్, వోర్సెస్టర్ – మధ్యాహ్నం 3:30
♦ జూలై 7, 5వ వన్డే – కౌంటీ గ్రౌండ్, న్యూ రోడ్, వోర్సెస్టర్ – మధ్యాహ్నం 3:30.

భారత అండర్ 19 జట్టు..
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహమ్మద్ ఎనన్, అన్మోల్జిత్ సింగ్, డి. దీపేష్, నమన్ పుష్పక్.