అయ్యో.. ఇంత మాట అనేసిందేంటి భయ్యా..? బుమ్రాను ట్రోల్ చేసిన భార్య సంజన.. పాపం బుమ్రా ఫేస్ చూశారా.. వీడియో వైరల్..

జస్ర్పీత్ బుమ్రా, సంజన గణేషన్ వివాహం మార్చి 2021లో జరిగింది. వీరిది ప్రేమ వివాహం.

అయ్యో.. ఇంత మాట అనేసిందేంటి భయ్యా..? బుమ్రాను ట్రోల్ చేసిన భార్య సంజన.. పాపం బుమ్రా ఫేస్ చూశారా.. వీడియో వైరల్..

Jasprit Bumrah Sanjana Ganesan

Updated On : June 27, 2025 / 12:23 PM IST

Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే.. క్రీజులో ఉన్న ఎంతటి బ్యాటర్‌కైనా గుండెల్లో కాస్త దడ వచ్చేస్తుంది. ఎందుకంటే.. బుమ్రా వేసే యార్కర్స్‌ను ఎదుర్కోవడం అంత ఈజీకాదు.. అందుకే అతను ప్రపంచంలోనే నెంబర్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీశాడు. ఇటీవలే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న బుమ్రా తన భార్య సంజన గణేషన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Also Read: ICC: టెస్ట్ క్రికెట్‌లోనూ ‘స్టాప్ క్లాక్’ నిబంధనలు.. దీని గురించి తెలుసా..? ఇకనుంచి అలాంటి కెప్టెన్లకు డేంజరే.. నో బాల్‌కు నో రన్స్..

టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడి భార్య గీతా బస్రాతో కలిసి హూజ్ ద బాస్ అనే షో నిర్వహిస్తున్నాడు. ఈ షోలో ప్రముఖ క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తుంటారు. తాజాగా.. జస్ర్పీత్ బుమ్రా – సంజన గణేషన్ దంపతులను ఈ షోలో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలోని విశేషాలను బుమ్రా,సంజన పంచుకున్నారు. వీరి ఇంటర్వ్యూకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో బుమ్రాను అతని భార్య ట్రోల్ చేసింది.. ఆ సమయంలో బుమ్రా సీరియస్ గా కనిపించాడు. దీంతో నెటిజన్లు ‘భయ్యా అంతమాట అనేసిందేంటి’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

 

బుమ్రాతో వివాహానికి ముందు జరిగిన ఓ ఫన్నీ సంఘటనను సంజన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పెళ్లికి ముందు బుమ్రా ఒకసారి సరదాగా పారిపోదాం అని చెప్పాడు. అయితే నువ్వు రన్నింగ్ చేస్తే అవ్వదని చెప్పా. ఎందుకంటే రనప్ సమయంలోనే బుమ్రా సరిగ్గా పరిగెత్తడు. అలాంటిది అప్పుడు నాతో ఎలా పరిగెత్తుతాడు’’ అంటూ సంజనా బుమ్రాను ఆటపట్టించింది. సంజన్ డైలాగ్ చెప్పగానే బుమ్రా ముఖం వాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


జస్ర్పీత్ బుమ్రా, సంజన గణేషన్ వివాహం మార్చి 2021లో జరిగింది. వారికి ఒక బాబు ఉన్నాడు. సంజన ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్. ఆమె మొదటిసారి 2013-14 ఐపీఎల్ సీజన్‌లో తన స్పోర్ట్స్ ప్రెజెంటర్ విధుల్లో భాగంగా బుమ్రాను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వారి మధ్య స్నేహపూర్వక సంభాషణలు జరిగాయి. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాలు డేటింగ్ తర్వాత 15 మార్చి 2021న గోవాలో బుమ్రా, సంజన వివాహం చేసుకున్నారు.