ICC: టెస్ట్ క్రికెట్‌లోనూ ‘స్టాప్ క్లాక్’ నిబంధనలు.. దీని గురించి తెలుసా..? ఇకనుంచి అలాంటి కెప్టెన్లకు డేంజరే.. నో బాల్‌కు నో రన్స్..
వైట్ బాల్ క్రికెట్ లాగే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.

ICC Stop Clock
ICC Stop Clock: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు క్రికెట్ లోనూ స్టాప్ క్లాక్ ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ తో అమల్లోకి వచ్చింది. ఈ సాప్ట్ క్లాక్ నిబంధనను గతేడాది జూన్ నుంచే వన్డేలు, టీ20 క్రికెట్లో అమలు చేస్తున్నారు.
Also Read: IND vs ENG: రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు బిగ్‌షాక్.. గాయపడ్డ కీలక ప్లేయర్..
వైట్ బాల్ క్రికెట్ లాగే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. దీంతో ప్రతి ఓవర్ తరువాత తదుపరి ఓవర్ 60 సెకన్లలో ప్రారంభించాల్సి ఉంటుంది. ఏదైనా ఆలస్యం జరిగితే మొదటి రెండు సార్లు హెచ్చరిక ఉంటుంది. అదే సమయంలో మూడోసారి కూడా ఆలస్యం అయితే.. బ్యాటింగ్ జట్టుకు ఫెనాల్టీగా ఐదు పరుగులు ఇస్తారు. ప్రతి 80ఓవర్ల తరువాత ఈ హెచ్చరిక రీసెట్ చేయబడుతుంది. అంటే అంపైర్ మళ్లీ రెండుసార్లు హెచ్చరిక ఇవ్వచ్చు. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టు నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
స్టాప్ క్లాక్ ఎలా పనిచేస్తుంది.. ?
టెస్టు క్రికెట్ లోనూ ఐసీసీ స్టాప్ క్లాక్ ను తీసుకొచ్చింది. ఈ విధానంలో భాగంగా మైదానంలో ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ ఉంటుంది. దీన్ని థర్డ్ అంపైర్ ఆపరేట్ చేస్తారు. ఓవర్ల మధ్య 0 నుంచి 60 సెకన్ల వరకు ఇది లెక్కిస్తుంది. ఫీల్డింగ్ చేసే జట్టు ఆ సమయం లోపల తరువాత ఓవర్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ బౌలింగ్ జట్టు అలా చేయకపోతే రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలాంటి పొరపాటు జరిగితే ఐదు పరుగులు జరిమానా విధిస్తారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలలో (వన్డే, టీ20) స్టాప్ క్లాక్‌తో సానుకూల ఫలితాలు రావడంతో టెస్టు క్రికెట్ లోనూ దీనిని ప్రవేశపెట్టారు.
ఇతర కీలక నిబంధనలు ఇవే..
బంతిపై లాలాజలం (ఉమ్మి) రాయడంపై నిషేధం ఇకపైనా కొనసాగుతుంది. అయినా సరే.. ఉమ్మి రాసిన బంతిని అంపైర్లు మార్చడం ఇక తప్పనిసరి కాదు. బౌలింగ్ జట్టు బంతి మార్పుకోసం ఉద్దేశపూర్వకంగా లాలాజలం రాసే అవకాశం ఉండటంతో ఈ మార్పు చేశారు. బంతి మార్పును అంపైర్ల విచక్షణకు వదిలేశారు. బంతి పరిస్థితి తీవ్రంగా మారితేనే (ఉదాహరణకు అది బాగా తడిగా లేదా మెరిసేలా కనిపిస్తే) అంపైర్లు బంతిని మారుస్తారు.
నోబాల్ విషయంలోనూ కీలక మార్పులు చేశారు.. ఇప్పటి వరకు ‘నో బాల్’ అని ప్రకటించాక.. క్యాచ్ ఎలాంటిది అన్నది చూసేవాళ్లు కాదు. కానీ, సవరించిన నిబంధనల ప్రకారం.. ఒకవేళ ఫీల్డర్ క్యాచ్ సరిగా పట్టిఉంటే బ్యాటింగ్ జట్టుకు నోబాల్ కింద వచ్చే పరుగు ఒక్కటే వస్తుంది. అది క్లీన్ క్యాచ్ కాకపోతే మాత్రం బ్యాటింగ్ జట్టుకు బ్యాటర్లు తీసినన్ని పరుగులు లభిస్తాయి.