IND vs ENG: రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు బిగ్‌షాక్.. గాయపడ్డ కీలక ప్లేయర్..
రెండో టెస్టు ముందుకు భారత్ జట్టు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా రెండో టెస్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలిసింది.

IND vs ENG Test
IND vs ENG 2nd Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ జులై 2 నుంచి బర్మింగ్‌హోమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ జట్టు.. రెండో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అయితే, రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. తొలి టెస్టు సమయంలో కీలక బ్యాటర్ గాయపడ్డాడు. దీంతో అతను బర్మింగ్‌హోమ్ టెస్టుకు అందుబాటులో ఉండడని సమాచారం.
టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మ్యాచ్ లో సుదర్శన్ ఆడటం కష్టమని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. లీడ్స్ లో జరిగిన మొదటి టెస్టు సందర్భంగా సుదర్శన్ భుజానికి గాయమైంది. ప్రస్తుతం ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని రెండో టెస్టు నుంచి దూరం పెట్టేందుకు టీంమేనేజ్మెంట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, సాయిసుదర్శన్ గాయం గురించి బీబీసీఐ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టుతో సాయి సుదర్శన్ తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే, అతను తన తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకవేళ సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడకుంటే.. అతని స్థానంలో ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డిలలో ఎవరో ఒకరు తుదిజట్టులో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయి సుదర్శన్ రెండో టెస్టుకు దూరమైన పక్షంలో కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఒక ఆప్షన్. అతను బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ జట్టుకు అద్భుతాలు చేయగలడు. సాయి సుదర్శన్ స్థానంలో అతన్ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.