IND vs AUS: నాల్గో టెస్టు.. ఆస్ట్రేలియాపై పట్టుబిగిస్తున్న భారత్.. బుమ్రా, సిరాజ్ సూపర్ బౌలింగ్

మెల్బోర్న్ టెస్టులో నాలుగోరోజు తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.

IND vs AUS 4th test

IND vs AUS 4th Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి మూడు టెస్టులు పూర్తికాగా.. 1-1తో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. తాజాగా మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులు చేయగా.. భారత్ జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతున్న క్రమంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చి అద్భుత సెంచరీతో జట్టు స్కోర్ ను పెంచాడు. నితీశ్ రెడ్డి (114) సెంచరీతో భారత జట్టు 369 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 105 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Also Read: తన తండ్రిని బంధువులు హేళన చేస్తుండగా విన్న నితీశ్ కుమార్‌.. అందుకే ఇప్పుడు బాహుబలి స్టైల్‌లో సెలబ్రేషన్స్‌

బాక్సింగ్ డే టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 358/9తో భారత్ బ్యాటర్లు నితీశ్ కుమార్ (105), సిరాజ్ (2) క్రీజులోకి వచ్చారు.369 పరుగుల వద్ద నితీశ్ (114) ఔట్ కావడంతో టీమిండియా ఆలౌట్ అయింది. అయితే, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ బౌలర్లు వరుస షాక్ లు ఇచ్చారు. తద్వారా మ్యాచ్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. రెండో ఇన్నింగ్స్ లో ఉస్మాన్ జవాజా, సామ్ కొన్ స్టాస్ క్రీజులోకి వచ్చారు. బుమ్రా వేసిన ఆరో ఓవర్లో కొన్ స్టాస్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కొద్ది సేపటికే మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఉస్మాన్ ఖవాజా (21) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Also Read: Nitish Kumar Reddy : ఒక్క సెంచ‌రీ.. 5 రికార్డులు.. తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి ఘ‌న‌త‌.. సిక్స‌ర్ల కింగ్..

మెల్బోర్న్ టెస్టులో నాలుగోరోజు తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. లుబుషేన్, స్మిత్ క్రీజులో ఉన్నారు. సిరాజ్, బుమ్రాలు అద్భుతమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇదేసమయంలో మ్యాచ్ పై క్రమంగా పట్టు సాధించేందుకు బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇదిలాఉంటే.. బుమ్రా, సిరాజ్ అద్భుత బౌలింగ్ తో ఆస్ట్రేలియా ఓపెనర్లను ఔట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.