తన తండ్రిని బంధువులు హేళన చేస్తుండగా విన్న నితీశ్ కుమార్‌.. అందుకే ఇప్పుడు బాహుబలి స్టైల్‌లో సెలబ్రేషన్స్‌

తన తండ్రి ముత్యాలుకి కృతజ్ఞతలు తెలిపేలా, ఆయన కళ్లల్లో గర్వం నిండేలా ఇలా చేశాడు. ఆ సమయంలో ముత్యాలు డగ్-అవుట్‌లో నిలబడి మ్యాచ్ చూస్తూ, తన కొడుకు సెంచరీ చూసి మురిసిపోయాడు.

తన తండ్రిని బంధువులు హేళన చేస్తుండగా విన్న నితీశ్ కుమార్‌.. అందుకే ఇప్పుడు బాహుబలి స్టైల్‌లో సెలబ్రేషన్స్‌

©ANI

Updated On : December 28, 2024 / 8:26 PM IST

Nitish Reddy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచులో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి, తొలి సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలుపడ్డ నితీశ్ కుమార్ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.

అతడి భుజంపై ‘అకిలెస్’ హీల్’ టాటూ ఉంటుంది. గ్రీకు పురాణం నుంచి వచ్చిన పదం ‘అకిలెస్’ హీల్’. ఇది కష్టాలను తెలియజేస్తుంది. ఇందుకు సంబంధించి నితీశ్ కుమార్ వేయించుకున్న టాటూలో ఓ యోధుడితో పాటు పులి ఉంటుంది. నితీశ్ తన క్రికెట్ కలను నెరవేర్చుకునేందుకు గత 10 ఏళ్లలో తన కుటుంబం పడిన కష్టాలన్నింటికి గుర్తుగా ఈ టాటూను భావిస్తాడు.

తన కోసం ఎన్నో కష్టాలు పడి, తన కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో త్యాగాలు చేసి, పంటి బిగువున బాధను భరించిన తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. నితీశ్ కుమార్ తన కలను సాకారం చేసుకునే క్రమంలో అతడు తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఎన్నో బాధలు పడ్డాడు.

Nitish Kumar Maiden Century

©ANI

ఈ ఏడాది జూన్‌లో ఓ ఇంటర్వ్యూలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ… టీమిండియాలోకి రావడం గర్వించదగ్గ విషయమని, అయితే జట్టులోకి రావడంతో తన కల 100 శాతం నెరవేరినట్లు కాదని అన్నాడు. తాను ఆ జెర్సీని ధరించి తన దేశం కోసం మ్యాచ్‌లు గెలవగలిగితే తన కల నెరవేరుతుందని తెలిపాడు.

అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు టీమిండియా కోసం ధాటిగా ఆడాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టున పడేసేలా బ్యాటింగ్ చేశాడు. తన ప్రతిభను నమ్మి క్రికెట్‌లో రాణిస్తాడని తన గురించి తన తండ్రి కొన్నేళ్ల క్రితమే అనుకున్నాడని, అయితే, అందుకు కొందరు తన తండ్రి పట్ల హేళన చేస్తూ మాట్లాడారని చెప్పాడు. అవమానాలకు గురైన తన తండ్రి కళ్లలో గర్వాన్ని చూడాలనుకున్నానని తెలిపాడు.

ఈ టెస్ట్‌ మ్యాచులో సెంచరీ చేశాక నితీశ్ కుమార్ అమరేంద్ర బాహుబలి (హీరో ప్రభాస్‌ పాత్ర) స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన తండ్రి ముత్యాలుకి కృతజ్ఞతలు తెలిపేలా ఇలా చేశాడు. ఆ సమయంలో ముత్యాలు డగ్-అవుట్‌లో నిలబడి మ్యాచ్ చూస్తూ, తన కొడుకు సెంచరీ చూసి మురిసిపోయాడు.

Nitish Kumar Reddy Maiden Century

@ANI

బంధువులు హేళన చేస్తుండగా విన్న నితీశ్‌
నితీశ్ కుమార్‌ 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతడి తండ్రి ముత్యాలు హిందుస్థాన్ జింక్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్‌) తీసుకున్నారు. ఉదయ్‌పుర్‌కు తనను ట్రాన్స్‌ఫర్ చేయడంతో తన కుమారుడికి అక్కడ సరైన కోచింగ్ సౌకర్యాలు ఉండవని ఆ నిర్ణయం తీసుకున్నారు.

తర్వాత తన మైక్రో-ఫైనాన్సింగ్ వ్యాపారంలో డబ్బును పోగొట్టుకున్నారు. దీంతో అతని బంధువులు తన తండ్రిని తిడుతూ, హేళన చేస్తుడగా నితీశ్ కుమార్‌ విన్నాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నితీశ్ చెప్పాడు. ఆ సమయంలో తన తండ్రికి ఓ ప్రామిస్‌ చేశానని, ఆయన గౌరవాన్ని తిరిగి నిలబెడతానని చెప్పానని నితీశ్ అన్నాడు. ఇప్పుడు సెంచరీ బాది.. తన తండ్రి తలెత్తుకునేలా చేసి, బాహుబలి స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు.

nitish reddy bowl

@ANI

నెలకు రూ.15,000 ఆర్థిక సాయంతో..
నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి అతనిని భారత మాజీ వికెట్ కీపర్, మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు పరిచయం చేసినప్పుడు నితీశ్ కు కేవలం 12 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు ప్రసాద్. నితీశ్ ను ఆయన కొన్ని ప్రశ్నలు అడిగి అతడిని అంచనా వేసి, నెట్స్‌లో అతనిని గమనించాడు.

నితీశ్ తన ప్రొఫెషనల్ స్ట్రోక్ ప్లే, క్రమశిక్షణతో కూడిన వికెట్-టు-వికెట్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన ప్రసాద్.. నితీశ్‌ను ఆంధ్రా క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు పరిచయం చేశాడు. అసోసియేషన్ నితీశ్‌కి ఆర్థిక సాయం అందించింది. నెలకు రూ. 15,000 పెట్టుబడి పెట్టింది. అతని క్రికెట్, విద్యా అవసరాలను అసోసియేషన్ చూసుకుంది.

హాఫ్ సెంచరీ బాదాక “పుష్ప” స్టైల్‌లో నితీశ్ సంబరం