IND vs AUS: రసవత్తరంగా ఐదో టెస్టు.. ఆస్ట్రేలియా లక్ష్యం 162 రన్స్.. భారత్ బౌలర్లు మ్యాజిక్ చేస్తారా..

బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం దిశగా పయణిస్తుంది..

IND vs AUS 5th Test

India vs Australia 5th Test : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 157 పరుగులకే ఆలౌట్ అయింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ ఐదో టెస్టులోనూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఐదు టెస్టు మ్యాచ్ లలో రెండు టెస్టుల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఐదో టెస్టులో విజయం సాధిస్తే సిరీస్ ను 3-1తో గెలుచుకుంటుంది.

Also Read: IND vs AUS 5th Test : ర‌స‌వ‌త్త‌రంగా సిడ్నీ టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట‌.. 145 ప‌రుగుల ఆధిక్యంలో భార‌త్‌..

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్తుంది. భారత్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు పింక్ స్ట్రైప్స్ దుస్తుల్లో మైదానంలోకి వచ్చారు. జేన్ మెక్‌గ్రాత్‌ డే సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్ల పింక్ స్ట్రైప్ దుస్తుల్లో కనిపించారు. 2008లో జేన్ మెక్‌గ్రాత్‌ క్యాన్సర్ కన్నుమూశారు. ఈమె ఆసీస్ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ సతీమణి. క్యాన్సర్ బాధితులకు మద్దతుగా ప్రతీయేటా జనవరి 5న జరిగే మ్యాచ్ లో ఆటగాళ్లు ఈ పింక్ స్ట్రైప్స్ దుస్తులు ధరిస్తారు.

Also Read: IND vs AUS 5th Test : తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 ఆలౌట్‌.. భార‌త్‌కు 4 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం..

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. రెండో రోజు (శనివారం) ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఆలౌట్ అయింది. కమిన్స్ బౌలింగ్ లో జడేజా (13) పెవిలియన్ బాటపట్టగా.. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ (12) కమిన్స్ బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే బొలాండ్ బౌలింగ్ లో సిరాజ్ (4) ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. వెన్నునొప్పి కారణంగా రెండో ఆటలో మైదానాన్ని వీడిన జస్ర్పీత్ బుమ్రా బ్యాటింగ్ వచ్చినా వెంటనే డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో 157 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ ఒక్కడే 6 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ మూడు, వెబ్ స్టర్ ఒక వికెట్ తీశారు.

Also Read: IND vs AUS: సిడ్నీ టెస్టులోనూ తీరుమార్చుకోని భారత బ్యాటర్లు.. కోహ్లీకి కలిసొచ్చిన అదృష్టం.. రోహిత్ రియాక్షన్ వైరల్

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో కొన్ స్టాస్ (22), మార్నస్ లబుషేర్ (6), స్టీవ్ స్మిత్ (4) పరుగుల వద్ద ఔట్ అయ్యారు. మూడో రోజు (ఆదివారం) మధ్యాహ్న భోజన సమయానికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. మరో 91 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా ఐదో టెస్టులో విజయకేతనం ఎగురవేసి బోర్డర్ గావస్కర్ టెస్టును కైవసం చేసుకుంటుంది. అయితే, టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా మైదానంలోకి రాలేదు. అతను వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.