IND vs AUS 5th Test : రసవత్తరంగా సిడ్నీ టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల ఆధిక్యంలో భారత్..
సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది.

IND vs AUS 5th Test Day 2 Stumps India lead by 145 runs
సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమానికి భారత్ 32 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6)లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన నాలుగు పరుగులతో కలిపి ప్రస్తుతం భారత్ 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌లో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం తేలడం ఖాయం. మూడో రోజే మ్యాచ్ పూరైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది భారత్. తొలి ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాది తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పాడు యశస్వి జైస్వాల్. అయితే మరోసారి కేఎల్ రాహుల్ (13) నిరాశపరిచాడు. జట్టు స్కోరు 42 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాసేపటికే దూకుడుగా ఆడబోయి యశస్వి(22), పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ కోహ్లీ (6), ఆదుకుంటాడు అనుకున్న శుభ్‌మన్ గిల్ (13)లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Rishabh Pant : పంత్ కాక.. టెస్టు అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఆ కొట్టుకు ఏందీ సామీ..
ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన రిషబ్ పంత్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ ఇదే. మరోవైపు జడేజా నిలకడగా ఆడుతుండగా తనదైన శైలిలో పరుగుల వరద పారిస్తున్న పంత్‌ను కమిన్స్ ఔట్ చేశాడు. దీంతో 46 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
మెల్‌బోర్న్‌లో సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి(4) మరోసారి నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్, జడేజాలు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ నాలుగు వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ చెరో వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Virat Kohli : అదే నిర్లక్ష్యం.. విరాట్ కోహ్లీ మళ్లీ విఫలం.. ఇక రిటైర్‌మెంటే..?
Stumps on Day 2 in Sydney.#TeamIndia move to 141/6 in the 2nd innings, lead by 145 runs.
Ravindra Jadeja & Washington Sundar at the crease 🤝
Scorecard – https://t.co/NFmndHLfxu #AUSvIND pic.twitter.com/4fUHE16iJq
— BCCI (@BCCI) January 4, 2025